Share News

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

ABN , Publish Date - Sep 15 , 2025 | 11:57 PM

రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా అందించడంలో విఫలమైం దంటూ రైతులు మండిపడ్డారు. లక్షెట్టిపేట పట్టణంలో సో మవారం దండేపల్లి, లక్షెట్టిపేట రెండు మండలాల రైతులు పెద్ద సంఖ్యలో ఆందోళన చేపట్టారు. రైతులకు బీఆర్‌ఎస్‌ నా యకులు మద్దతు తెలిపారు.

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
కోటపల్లిలో రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులు

రైతులకు మద్దతు బీఆర్‌ఎస్‌ నాయకులు

లక్షెట్టిపేట, సెప్టెంబరు15 (ఆంధ్రజ్యోతి): రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా అందించడంలో విఫలమైం దంటూ రైతులు మండిపడ్డారు. లక్షెట్టిపేట పట్టణంలో సో మవారం దండేపల్లి, లక్షెట్టిపేట రెండు మండలాల రైతులు పెద్ద సంఖ్యలో ఆందోళన చేపట్టారు. రైతులకు బీఆర్‌ఎస్‌ నా యకులు మద్దతు తెలిపారు. సుమారు గంట పాటు రైతు లు బీఆర్‌ఎస్‌ నాయకులు స్థానిక ఊత్కూర్‌ చౌరస్తాలో ని రాష్ట్ర రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్‌ జామ్‌ అ య్యింది. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై మండిపడ్డారు. ఈసంద ర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో రైతులు రోడ్డెక్కిన పరిస్థితులు లేవన్నారు. రైతు లకు యూరియా కూడా ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం మన రేవంత్‌ ప్రభుత్వం అంటూ విమర్శించారు. మరోవైపు మంచి ర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని నోరు విప్పితే అన్ని అబద్ధాలే అన్ని అం టూ ఎద్దేవా చేసారు. సుమారు గంట పాటు రోడ్డుపై బైఠా యించడంతో స్థానిక సీఐ రమణమూర్తి, ఎస్సై సురేష్‌ సిబ్బందితో వచ్చి ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో చెదరగొ ట్టారు. అనంతరం బీఆర్‌ఎస్‌ నాయకులు రైతులు మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్‌కు యూరియా అందించాలని వినతిపత్రం అందజేసారు. ఈకార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు, పార్టీ పట్టణ అధ్య క్షుడు పాదం శ్రీనివాస్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నలుమా సు కాంతయ్య, వైస్‌ చైర్మన్‌ పోడేటి శ్రీనివాస్‌గౌడ్‌, డీసీ ఎమ్మెస్‌ మాజీ చైర్మన్‌ కేతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, దండేపల్లి పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, నాయకులు పాల్గొన్నారు.

కోటపల్లిలో రైతుల బైఠాయింపు

కోటపల్లి : కోటపల్లి మండల కేంద్రంలో సోమవారం రైతులు రోడ్డెక్కారు. తమకు ఇంత వరకు యూరియా రాలే దని, యూరియా అందించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. కోటపల్లి-చెన్నూరు ప్రధాన రహదారిపై రైతు వేదిక ముందు రైతులు బైఠాయించి రెండు గంటల పాటు ధర్నాకు దిగారు. దీంతో ఎటు వాహనాలు అటే నిలిచిపోయాయి. రైతు వేదిక వద్ద ఎరువుల పంపిణీ ఉంటుందని తప్పుడు ప్రచారం జర గడంతో వివిధ గ్రామాల నుంచి వందలాది మంది రైతులు రైతు వేదిక వద్దకు చేరుకుని రాస్తారోకో చేపట్టారు. అయితే ఆందోళనకారులను శాంతించేందుకు వ్యవసాయ శాఖ ఏఈ వో రాజ్‌కుమార్‌తో పాటు సిబ్బంది ప్రయత్నించినా రైతులు వినకుండా రోడ్డుపైనే భైఠాయించారు. ఎస్‌ఐ రాజేందర్‌ , ఏఈవో రాజ్‌కుమార్‌లు రైతులను సముదాయించి రోడ్డుపై నుంచి లేపి రైతు వేదిక వద్దకు తీసుకువెళ్లి మాట్లాడారు. మంజూరై వచ్చే యూరియా బస్తాల పంపిణీలో మొదటి ప్రాధాన్యత మీకే ఇస్తామంటూ టోకెన్‌లు అందించారు. దీంతో రైతులు శాంతించారు.

చెన్నూరు: రైతులకు సక్రమంగా యూరియా పంపిణీ చేయాలని కోరుతూ సోమవారం కిష్టంపేట గ్రామంలోని రైతు వేదిక వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. మండలం లోని నారాయణపూర్‌, కత్తెరసాల గ్రామాలకు రైతులకు పం పిణీ చేసేందుకు కిష్టంపేట గ్రామంలోని రైతు వేదిక వద్దకు పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 444 యూరియా బస్తాలు వచ్చాయి. దీంతో రైతులు దాదాపు 800 మంది రైతు వేదిక చేరుకు న్నారు. పంపిణీ ప్రారంభించకపోవడంతో రైతులు ధర్నాకు దిగారు. చెన్నూరు -మంచిర్యాల రహదారిపై రాస్తారోకో నిర్వ హించారు. విషయం తెలుసుకున్న చెన్నూరు సీఐ దేవేంద ర్‌రావు, ఎస్‌ఐ సుబ్బారావులు చేసుకుని రైతులకు నచ్చజె ప్పారు. దీంతో పోలీసు పహారా మధ్య యూరియా బస్తాల ను పంపిణీ చేశారు.

ఫచెన్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం చౌరస్తా వద్ద సోమవారం మహిళ రైతులు యూరియా పంపిణీ చేయాలని ధర్నా నిర్వహించారు. రోడ్డుపై ధర్నా చేయడంతో ఎటు వాహనాలు అటే నిలిచిపోయాయి. దీంతో కొద్ది సేపటి తర్వాత రైతులు వెళ్లిపోయారు.

Updated Date - Sep 15 , 2025 | 11:57 PM