Share News

రైతులు మఖానా సాగు చేపట్టాలి

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:55 AM

జిల్లా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండి, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి ఇచ్చే మఖానా పంటను రైతులు సాగుచేసి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆర్డీవో అశోక్‌రెడ్డి అన్నారు.

 రైతులు మఖానా సాగు చేపట్టాలి
కనగల్‌ గ్రామ సమీపంలో మఖానా విత్తనాలు చల్లుతున్న ఆర్డీవో అశోక్‌రెడ్డి

రైతులు మఖానా సాగు చేపట్టాలి

ఆర్డీవో అశోక్‌రెడ్డి

కనగల్‌, ఏప్రిల్‌ 24 (ఆంద్రజ్యోతి): జిల్లా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండి, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి ఇచ్చే మఖానా పంటను రైతులు సాగుచేసి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆర్డీవో అశోక్‌రెడ్డి అన్నారు. గు రువారం కనగల్‌ గ్రామ సమీపంలోని కుంభం నర్సిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన నారుమడిలో మఖానా సీడ్‌ను అధికారులతో కలిసి చల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మఖానా పంటకు చీడపీడల బెడద త క్కువని, రసాయన ఎరువుల వాడకం ఉండదన్నారు. వేపనూనె పిచికారీ చేస్తే సరిపోతుందన్నారు. మఖానాలో అన్ని పోషక విలువులు సమృద్ధిగా ఉండటం తో దీన్ని సూపర్‌ఫుడ్‌గా పేర్కొంటారని వివరించారు. ఎకరాకు పెట్టుబడి కింద రూ.60 నుంచి రూ.80వేల వరకు ఖర్చు వస్తుందన్నారు. 30 నుంచి 34 క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందని, రైతులకు అన్ని ఖర్చులుపోగా రూ.2లక్షల నుంచి రూ.2.50లక్షల ఆదాయం లభిస్తుందన్నారు. పంట సాగు కాలం 8 నెలలు ఉండగా రసాయన ఎరువులు వాడకం లేనందున పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు.

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు ఈ పంట సాగుపై అధికారుల బృందం ఇటీవల బీహార్‌ రాషా్ట్రనికి వెళ్లి పరిశీలన చేసి వచ్చారని వివరించారు. జిల్లా వాతావరణ పరిస్థితులు మఖానా సాగుకు సరిపోతుందని గు ర్తించినట్లు తెలిపారు. రైతులు పంటల మార్పిడి చేయాలని సూచించారు. కా ర్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి అనంతరెడ్డి, ఏవోలు అమరేందర్‌గౌడ్‌, శ్రీనివాస్‌, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 12:55 AM