కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:19 PM
ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి కోరారు.
- ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి
బిజినేపల్లి, నవంబరు20 (ఆంధ్రజ్యో తి) : ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి కోరారు. మండలంలోని మంగనూర్, లట్లుపల్లి గ్రామాల్లో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువా రం ఆయన ప్రారంభించారు. రైతులు పండిం చిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుం దని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మాజీ ఎంపీటీసీ చంద్రగౌడ్, కమతం శ్రీనివాస్ రెడ్డి, గోవిందు నాయక్, పూల్యానాయక్, వాల్యానా యక్ తదితరులు ఉన్నారు.