Share News

kumaram bheem asifabad- రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Jun 12 , 2025 | 10:20 PM

ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే తెలిపారు. గురువారం మండలంలోని చిర్రకుంట గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును సందర్శించి రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు.

kumaram bheem asifabad- రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే తెలిపారు. గురువారం మండలంలోని చిర్రకుంట గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును సందర్శించి రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం భూ భారతి నూతన ఆర్‌ఓఆర్‌ చట్టం అమలులో రెవెన్యూ సదస్సులు నిర్వహిసస్తున్నామని అన్నారు. భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి దరఖాస్తును రిజిస్టర్‌లో నమోదు చేసి రికార్డులతో సరి చూసి క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ జరిపి త్వరగా సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రైతులు భూ సమస్యలపై దరఖాస్తులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి తహసిల్దార్‌ పోచయ్య, ఆర్‌ఐ సాయి, మాజీ ఎంపీపీ మల్లికార్జున్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

గిరిజనుల సంక్షేమానికి..

ఆసిఫాబాద్‌, (ఆంధ్రజ్యోతి): గిరిజనుల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం ప్రధాన మంత్రి జనజాతీయ ఉత్రక్ష గ్రామ అభియాన్‌ కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి జనజాతీయ ఉత్రక్ష గ్రామఅభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15 నుంచి 30 వరకు జిల్లాలో 102 గిరిజన గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి అవసరమైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి రోజు వారిగా వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఆధార్‌ కార్డులు లేని వారిని గుర్తించాలని, బ్యాంకు ఖాతాలు లేని వారిని గుర్తించి ఖాతాలు తెరిపించాలన్నారు. వైద్య శిబిరాలు నిర్వహించి వ్యాధులు నిర్ధారించాలని, స్వయం సహాయక సంఘాల్లో నమోదు వారిని గుర్తించి సభ్యులుగా చేర్పించాలన్నారు. విద్యుత్‌ సరఫరా లేని గ్రామాలను గుర్తించి అర్హులైన వారికి వెంటనే విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలన్నారు. అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణాల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. గ్రామీణ ఉపాఽధి హామీ పథకం కింద కొత్త వారికి జాబ్‌ కార్డులను అందించాలని సూచించారు. కేంద్రప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి ప్రధాన మంత్రి జూగా పథకం చేపట్టిందని తెలిపారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 10:20 PM