kumaram bheem asifabad- రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Dec 26 , 2025 | 10:20 PM
ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని రైతులు, పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారి శరణ్య అన్నారు. మండలంలోని బంబారలో నిర్వహించిన పశువైద్య శిబిరంలో శుక్రవారం పశువులకు నట్టల నివారణ మందులు వేశారు.
వాంకిడి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని రైతులు, పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారి శరణ్య అన్నారు. మండలంలోని బంబారలో నిర్వహించిన పశువైద్య శిబిరంలో శుక్రవారం పశువులకు నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణాజీ, ఉప సర్పంచ్ సంతోష్, సిబ్బంది గణపతి, రాజు, నరేష్, వినోద్, లాలాజీ తదితరులు పాల్గొన్నారు.
పెంచికలపేట (ఆంధ్రజ్యోతి): ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమా న్ని రైతులు, పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని మండల పశువైద్యాఽ దికారి రాకేష్ అన్నారు. మండలంలోని ఎల్కపల్లి, ఎల్లూరు, పెంచికలపేట గ్రామాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందును శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ నట్టల నివారణతో జీవాల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. ఈ మందు ద్వారా మరణాలు తగ్గి, జీవాల ఆరోగ్యం మెరుగుతుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు రాంచందర, రవి, ఉస్మాన్ పాల్గొన్నారు.