రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Nov 28 , 2025 | 11:15 PM
గ్రామాలల్లో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను రైతు లు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీవో చిన్న ఓబులేష్ అన్నారు.
- డీఆర్‌డీవో చిన్న ఓబులేష్
తిమ్మాజిపేట, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : గ్రామాలల్లో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను రైతు లు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీవో చిన్న ఓబులేష్ అన్నారు. మండల పరిధిలోని కో డుపర్తిలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా రైతులతో ఆయన మాట్లాడుతూ రైతు లు దళారులను నమ్మి మోస పో వద్దన్నారు. అదేవిధంగా మహిళా సంఘం సభ్యులతో మాట్లాడారు. శ్రీనిధి ద్వారా తీసుకున్న కెణాలు సకాలంలో చెల్లించాలన్నారు. మ హిళలు శ్రీనిధి రుణాలను జీవనో పాధుల కోసం ఉపయోగించుకు ని ఆర్థికంగా ఎదగాలన్నారు. అనం తరం నర్సరీని పరిశీలించి పలు సూచనలు చేశా రు. ఏపీఎం నిరంజన్, సీసీ నాగరాజు, టెక్నికల్ అసిస్టెంట్ రాజేష్, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.