Share News

రైతులు శాస్త్రీయ వ్యవసాయం చేయాలి

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:17 AM

వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించి రైతులు శాస్త్రీయంగా వ్యవసా యం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు.

రైతులు శాస్త్రీయ వ్యవసాయం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

మునుగోడు రూరల్‌, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించి రైతులు శాస్త్రీయంగా వ్యవసా యం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని కొంపెల్లి రైతువేదికలో సోమవారం జరిగిన రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులను నమ్మకుండా వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలన్నారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రస్తుతం రైతులు పంటల సాగు చేస్తున్నందున రైతులకు వెంటనే రైతుభరోసా వారి ఖాతాలో జమ చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో పద్మజ, కొంపెల్లి ఏఈవో యాదగిరి, వహీద్‌, లాలయ్య, కోటేశ్వరరావు, ఆల్ల రాజు వీరమల్ల యాదయ్య వీరమల్ల వెంకట్‌ రాములు, ఎడ్ల రామలింగయ్య, శ్యామల, సుజాత, లక్ష్మి, వెంకటమ్మ, సురిగి చలపతి పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 12:17 AM