Share News

kumaram bheem asifabad- రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలి

ABN , Publish Date - Nov 04 , 2025 | 09:52 PM

రైతులకు ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌తో కలిసి జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్‌, రవాణా, అగ్నిమాపక, పోలీసు శాఖల అధికారులు, సీసీఐ అధికారులు, జిన్నింగ్‌ మిల్లుల యజమాన్యలతో పత్తి కొనుగోలు, జిన్నింగ్‌ మిల్లులలో ఏర్పాట్లు, కపాస్‌ కిసాన్‌ మొబైల్‌ యాప్‌ నిర్వహణ, రైతులకు అవగాహన, జిన్నింగ్‌ మిల్లులో రక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించారు.

kumaram bheem asifabad- రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌తో కలిసి జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్‌, రవాణా, అగ్నిమాపక, పోలీసు శాఖల అధికారులు, సీసీఐ అధికారులు, జిన్నింగ్‌ మిల్లుల యజమాన్యలతో పత్తి కొనుగోలు, జిన్నింగ్‌ మిల్లులలో ఏర్పాట్లు, కపాస్‌ కిసాన్‌ మొబైల్‌ యాప్‌ నిర్వహణ, రైతులకు అవగాహన, జిన్నింగ్‌ మిల్లులో రక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 2025-26 సీజన్‌ పత్తి కొనుగోలుకు జిన్నింగ్‌ మిల్లుల యజమానులు, సీసీఐ, మార్కెటింగ్‌ అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలో ఈ సీజన్‌లో 3.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగయిందని చెప్పారు. 38 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ దిశగా కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పత్తికి మద్దతు ధర రూ.8,110 నిర్ణయించారని అన్నారు. జిల్లాలో 24 జిన్నింగ్‌ మిల్లుల ద్వారా సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని సకాలంలో కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చే విధంగా మొబైల్‌ యాప్‌ వినియోగంపై వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అవగాహన కలిపంచాలని సూచించారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రతి జిన్నింగ్‌ మిల్లులో తనిఖీలు నిర్వహించి రక్షణ పరమైన ఏర్పాట్లు పరిశీలించాలని, మిల్లు నిర్వాహకులకు తగు సూచనలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌ జాస్తిన్‌ జోల్‌, మార్కెటింగ్‌ అధికారి ఆశ్వక్‌ అహ్మద్‌, రవాణా శాఖ అధికారి రాంచందర్‌, సీసీఐ అధికారులు, జిన్నింగ్‌ మిల్లుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేయాలి

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పనులను లబ్ధిదారులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. వాంకిడి మండలం జైత్‌పూర్‌ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామం మొదటి విడత ఇందిరమ్మ మోడల్‌ గ్రామంగా ఎంపికైందని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో నిర్మాణాలు చివరి దశలో ఉండడం సంతృప్తికరంగా ఉందని అభినందించారు. త్వరంలో ప్రారంభానికి సిద్ధం చేసేలా పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ వెంట పీడీ వేణుగోపాల్‌, ఇంజనీరింగ్‌ అదికారులు, కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.

ఆసిఫాబాద్‌, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్యను పెంపొందించాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లతో విద్యార్థులు, అధ్యాపకుల హాజరు, ముఖ గుర్తింపు యాప్‌, విద్యాబోధన, మౌలిక వసతుల కల్పన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాఆ్లడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థలు బలోపేతం చేస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతుందని ఈ నేపథ్యంలో జూనియర్‌ కళాశాలలో పూర్తి సదుపాయాలు కల్పించడం జరిగిందని, విద్యార్థుల సంఖ్య పెంపొందించే విధంగా కృషి చేయాలని తెలిపారు. విద్యార్థుల గైర్హాజరు పై వారి తల్లితండురలతో మాట్లాడి క్రమం తప్పకుండా హాజరయ్యేలా కృషి చేయాలని తెలిపారు. వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో మాధ్యమిక విద్యాశాఖాధికారి రాందాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 09:52 PM