Share News

రైతులు విత్తనోత్పత్తిపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Sep 11 , 2025 | 11:30 PM

రైతులే త మ వ్యవసాయ క్షేత్రాలలో విత్తనోత్పత్తి చేసుకునే విధం గా ప్రభుత్వం ప్రోత్సహిస్తు న్నదని పాలెం వ్యవసాయ శాస్త్రవేత్త రాజశేఖర్‌ అన్నారు.

రైతులు విత్తనోత్పత్తిపై దృష్టి సారించాలి
పెద్దకొత్తపల్లి మండలంలో జొన్న పైరును పరిశీలిస్తున్న పాలెం వ్యవసాయ శాస్త్రవేత్త రాజశేఖర్‌, అధికారులు, రైతులు

- పాలెం శాస్త్రవేత్త రాజశేఖర్‌ వెల్లడి

కొల్లాపూర్‌/ పెద్దకొత్తప ల్లి/ కోడేరు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : రైతులే త మ వ్యవసాయ క్షేత్రాలలో విత్తనోత్పత్తి చేసుకునే విధం గా ప్రభుత్వం ప్రోత్సహిస్తు న్నదని పాలెం వ్యవసాయ శాస్త్రవేత్త రాజశేఖర్‌ అన్నారు. రైతులు తమ వ్యవసాయ క్షే త్రంలో నాణ్యమైన విత్తనాల ను ఎంచుకుని మేలైన యాజమాన్యం పద్ధతు లు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు. గురువారం కొల్లాపూర్‌ నియోజకవ ర్గంలోని కొల్లాపూర్‌ మండల మండలంలోని యన్మన్‌బెట్ల, పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాల్లో క్షేత్రస్థాయిలో వ్యవసాయ పంటలను పరిశీలిం చారు. స్థానిక వ్యవసాయ అధికారులతో కలిసి ఆయన వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంట లను పరిశీలించారు. ఇన్‌చార్జి ఏడీఏ, కొల్లాపూర్‌ మండల వ్యవసాయ అధికారి చిన్నహుస్సేన్‌ యాదవ్‌, నాగజ్యోతి, వ్యవసాయ విస్తరణ అధి కారి మధుసూదన్‌రెడ్డి, సువర్ణ, కురుమూర్తితో కలిసి పరిశీలించారు. వరిలో సూక్ష్మధాతు లోపా ల నివారణకు ఏయే మందులు వాడాలో రైతు లకు సూచించారు. పెద్దకొత్తపల్లి మండలంలో వ్యవసాయ అధికారి శిరీష, ఏఈవోలు ము జీబ్‌, జానకిరాములు, మల్లేష్‌తో కలిసి రాజశే ఖర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో రైతులు చె న్నమ్మ, రాములు, మల్లయ్య పాల్గొన్నారు. కోడే రులో మండల వ్యవసాయాధికారి నాగజ్యోతి, విస్తరణ అధికారి మధుసూదన్‌ రెడ్డి, సువర్ణ, రైతులు విజయరెడ్డి, మల్లయ్య పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 11:30 PM