kumaram bheem asifabad- రైతులకు సరిపడా యూరియా అందజేయాలి
ABN , Publish Date - Jul 05 , 2025 | 10:55 PM
రైతులకు ఇబ్బందులు కలగకుండా యూరియా సరిపడా అందజేయాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయాన్ని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎరువుల పంపిణీ చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
వాంకిడి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఇబ్బందులు కలగకుండా యూరియా సరిపడా అందజేయాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయాన్ని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎరువుల పంపిణీ చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఎరువుల పంపిణీలో అధికారులు జాప్యం చేయకుండా సరిపడా ఎరువులు ఇచ్చే విధంగా చూడాలన్నారు. రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడకుండా రెండు కౌంటర్లు ఏర్పాటు చేయాలని కార్యదర్శి ఓమాజీని ఆదేశించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి పథకాలపై తహసీల్దార్ కవితను అడిగి తెలుసుకున్నారు. బిల్లులు అందించి ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి అయ్యేలా చూడాలని సూచించారు. ఆయన వెంట ఏడీఏ మిలింథ్‌కుమార్ ఉన్నారు.