పోడు రైతులకు పట్టాలివ్వాలి
ABN , Publish Date - May 31 , 2025 | 10:36 PM
ఎన్నో సాగు చేసుకుంటున్న పోగు రైతులకు పట్టాలివ్వాలని అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకె ఎంఎస్) రాష్ట్ర సహాయ కార్యదర్శి లాల్‌కుమార్ అన్నారు. శనివారం ప ట్టణంలోని ఐఎఫ్‌టీయు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. పోడు రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని షరతులులేని బ్యాంక్ రుణాలు అందించాలని డిమాండ్ చేశారు.
బెల్లంపల్లి, మే31(ఆంధ్రజ్యోతి): ఎన్నో సాగు చేసుకుంటున్న పోగు రైతులకు పట్టాలివ్వాలని అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకె ఎంఎస్) రాష్ట్ర సహాయ కార్యదర్శి లాల్‌కుమార్ అన్నారు. శనివారం ప ట్టణంలోని ఐఎఫ్‌టీయు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. పోడు రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని షరతులులేని బ్యాంక్ రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. పోడు రైతుల కోసం ఆందోళనలు చేపట్టిన సమయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టాల పంపిణీకి అంగీకరించిందన్నారు నామమాత్రపు బోర్డు కమిటీలను ఏర్పా టు చేసి తూతూమంత్రంగా సర్వే చేపట్టారని, కొద్ది మందికి మాత్రమే పట్టాలు ఇచ్చి అన్యాయం చేశారన్నారు. వేల మంది అర్హులైన పోడు రైతులు ఉన్నారని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలివ్వాలని డిమాం డ్ చేశారు. అటవీశాఖ అధికారులు పోడు రైతులపై అక్రమకేసులు న మోదు చేయడం సరైందికాదన్నారు. పోడు రైతుల సమస్యల పరిష్కారం కోసం దశలవారిగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నం తిరుపతి, రమేశ్, చంద్రన్న, తుకారాం, శంకర్, గోపాల్‌లు పాల్గొన్నారు.