kumaram bheem asifabad- యూరియా కోసం రైతుల పడిగాపులు
ABN , Publish Date - Sep 22 , 2025 | 10:54 PM
యూరి యా కోసం రైతన్న కష్టాలు తప్పడంలేదు. రోజు రోజుకు యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. యూరియా వచ్చిందని తెలిస్తే చాలు వ్యవసాయ పనులు విడిచి రోజంతా భోజనం చేయకుండా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మండల కేంద్రంలోని మన గ్రోమోర్ లో యూరియా రావడంతో శని, ఆదివారం రైతులకు పంపిణీ చేశారు. సోమవారం కేవలం 1,500 యూరియా బ్యాగులు మాత్రమే ఉన్నాయని తెలియడంతో మండలంలోని రైతులు భారీగా తరలి వచ్చారు.
వాంకిడి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): యూరి యా కోసం రైతన్న కష్టాలు తప్పడంలేదు. రోజు రోజుకు యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. యూరియా వచ్చిందని తెలిస్తే చాలు వ్యవసాయ పనులు విడిచి రోజంతా భోజనం చేయకుండా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మండల కేంద్రంలోని మన గ్రోమోర్ లో యూరియా రావడంతో శని, ఆదివారం రైతులకు పంపిణీ చేశారు. సోమవారం కేవలం 1,500 యూరియా బ్యాగులు మాత్రమే ఉన్నాయని తెలియడంతో మండలంలోని రైతులు భారీగా తరలి వచ్చారు. ఉదయం నుంచి క్యూలో ఉన్న రైతులు నిరసంతో నిలబడలేక చెప్పులను క్యూలో పెట్టారు. రెండు రోజుల క్రితం టోకేన్లు ఇచ్చి న రైతులతో పాటు ఇతర రైతులు కూడా తరలిరావడంతో మన గ్రోమోర్ వద్ద రైతులు బారులు తీరారు. రెండు రోజుల క్రితం టోకేన్లు ఇచ్చిన రైతులకే యూరియా ఇస్తామని చెప్పడంతో టోకెన్లు తీసు కోని రైతులు ఆందోళనకు దిగారు. అందరికీ టోకేన్లు ఇచ్చి రైతులందరికి యూరియా ఇవ్వాలని వాగ్వా దానికి దిగారు విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మ హేందర్ అందరికి టోకెన్‌లు ఇచ్చి యూరియా పంపిణీ జరిగే లా చూస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు. పోలీసు బందో బస్తు మద్య రైతులకు యూరియా పంపిణీ చేశారు.
బెజ్జూరు ,(ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండల కేంద్రంలో సోమవారం యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. రోజుల తరబడి యూరియా కోసం వరుసలో నిలబడుతున్న సరిపడ యూరియా రావడం లేదంటూ ఆందోళన చేశారు. వివిధ గ్రామాల నుంచి రైతులు ఉదయం నుంచే యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున క్యూలైన్లలో నిలబడ్డారు.
పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద సోమవారం యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఏవో మనీషా రైతులకు రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేశారు. అలాగే మరికొంత మంది రైతులకు టోకెన్లు అందజేశారు. మధ్యాహ్న సమయంలో టోకెన్లు అయిపోయాయయని తెలపడంతో రైతులు ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఎస్సై అనిల్ ుమార్ రైతులకు నచ్చచెప్పి క్యూలైన్ ఏర్పాటు చేశారు. దీంతో వ్యవసాయాధికారులు క్యూలైన్లలో ఉన్న రైతులకు టోకెన్లు జారీ చేశారు. కోనేరు కార్యకర్తలు రైతులకు అల్ఫాహారం ఏర్పాటు చేశారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో మనగ్రోమోర్ సెంటర్ వద్ద యూరియా పంపిణీ చేస్తున్నారనే సమాచారం తెలుసుకున్న రైతులు బారులు తీరారు. ఉదయం ఆరు గంటలకే రైతులు చేరుకుని రాత్రి 8 గంటల వరకు వరుసలో ఉండి ఒకటి లేదా రెండు యూరియా బస్తాలు ఇవ్వడంతో రైతులు అసహనం వ్యక్తం చేశారు. మొత్తం 1, 111 యూరియా బస్తాలు పంపిణీ చేస్తున్నట్లు ఏవో రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు వంశీ, లావణ్య, సిబ్బంది శ్రీనివాస్, రాజు, చందు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.