Share News

kumaram bheem asifabad-యూరియా కోసం రైతుల బారులు

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:26 PM

యూరియా కోసం రైతులు బారులు తీరారు. మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘానికి శనివారం యూరియా బస్తాలు రావడంతో వివిద గ్రామానికి చెందిన రైతులు పెద్దమొత్తంలో వచ్చి వరుసలో నిలబడ్డారు. ఒక్కో రైతుకు కేవలం 2నుంచి 3బస్తాలు మాత్రమే ఇస్తుండడంతో రైతులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.

kumaram bheem asifabad-యూరియా కోసం రైతుల బారులు
బెజ్జూరులో యూరియా కోసం బారులు తీరిన రైతులు

బెజ్జూరు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): యూరియా కోసం రైతులు బారులు తీరారు. మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘానికి శనివారం యూరియా బస్తాలు రావడంతో వివిద గ్రామానికి చెందిన రైతులు పెద్దమొత్తంలో వచ్చి వరుసలో నిలబడ్డారు. ఒక్కో రైతుకు కేవలం 2నుంచి 3బస్తాలు మాత్రమే ఇస్తుండడంతో రైతులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఎన్నో రోజులుగా యూరియా కోసం గంటలతరబడి వరుసలో నిల్చొన్నా తక్కువ బస్తాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా సహకార సంఘానికి రైతులు తరలిరావడంతో సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల పహారా మధ్య యూరియాను రైతులకు అధికారులు పంపిణీ చేశారు. పది రోజులుగా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని క్యూలైన్‌లో వేచి చూశారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి) చింతలమానేపల్లి మండలంలోని బాలాజీఅనుకోడ రైతు వేదిక వద్ద యూరియా పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో ఉదయం నుండి యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా కొరత కారణంగా ఇన్ని రోజులుగా రైతులకు సరిపడా అందకపోవడంతో రైతులు ఉదయం నుండి బారులు తీశారు. అయితే రైతులకు టోకెన్లు కేటాయించి ఒక్కో రైతులకు కేవలం2 బస్తాలు మాత్రమే పంపిణీ చేస్తున్నారని భూమి ఎంత సాగు చేసినమో దానికి సరిపడా యూరియా ఇ్వెడం లేదని రైతులు ఆందోళన చేశారు. ఒక్కో రైతుకు కేవలం రెండు యూరియా బస్తాలు ఇస్తే ఎన్ని సార్లు యూరియా కోసం తిరుగాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందేలా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. యూరియా పంపిణీ కేంద్రం వద్ద ఎస్సై ఇస్లావత్‌ నరేష్‌, డిప్యూటి తహసీల్దార్‌, ఇతర పోలీస్‌ సిబ్బంది, వ్యవసాయ మండల అధికారి కార్తేషా, ఏఈఓలు నచ్చజెప్పుతూ యూరియా పంపిణీ చేశారు.

తిర్యాణి,(ఆంధ్రజ్యోతి): తిర్యాణి మండలంలో ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద శనివారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా వచ్చిందని సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం నుంచే కార్యాలయం ఎదుట బారులు తీరారు. ఎస్సై వెంకటేష్‌ ఆధ్వర్యంలో పోలీసు పహరా మధ్య యూరియాను పంపిణీ చేశారు. విడతల వారిగా యూరియాను రైతులకు అందిస్తామని ఏఓ వినయ్‌రెడ్డి, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ చుంచు శ్రీనివాస్‌ తెలిపారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): అరుగాలం శ్రమించే రైతన్నకు యూరియా సకాలంలో లబించక అవస్థలు పడుతున్నారు. శనివారం దహెగాం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కార్యాలయంలో యూరియా పంపిణీ చేస్తున్నరన్న సమాచారంతో పీపీరావు కాలనీ, హత్తిని, దహెగాం, కమ్మర్‌పెల్లి, లగ్గాం, మర్రిపెల్లి, ఐనం తదితర గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం ఏడు గంటలకే వరసు కట్టారు. వృద్దులు, చంటి పాపల తల్లులు, మహిళ రైతులు యూరియా కోసం బారులు తీరారు. రైతులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసు బందోబస్తు మధ్య యూరియా బస్తాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఐ కుమారస్వామి, ఏవో రామకృష్ణ, పీఏసీఎస్‌ సీఈఓ బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

పెంచికల్‌పేట, (ఆంధ్రజ్యోతి): పెంచికల్‌పేట మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద శనివారం రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. యూరియా లోడ్‌ వస్తుందని అధికారులు ముందుగానే తెలుపడంతో ఉదయం ఏడు గంటల వరకే బారీ సంఖ్యలో రైతులు అక్కడికి చేరుకున్నారు. సమయం 11:30 అయిన వ్యవసాయాధికారి మనీషా అక్కడికి రాకపోవడంతో ఎండలోనే రైతులు నిరీక్షించాల్సి వచ్చింది. ఎస్సై అనిల్‌కుమార్‌ సిబ్బందితో అక్కడికి చేరుకొని రైతులకు సర్థిచెప్పి క్యూలైన్‌లో నిలుచొబెట్టారు. వ్యవసాఽయాధికారి అక్కడికి రాగానే రైతులు వాగ్వాదానికి దిగారు. సమయ పాలన పాటించడంలేదని సరిపడ యూరియా రైతులకు అందడంలేదని అమెను ప్రశ్నించారు. ఉయదం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్‌లో నిలుచున్న కొంతమంది రైతులకే యూరియా బస్తాలు అందగా సరిపడ యూరియా లేకపోవడంతో చాలా మంది రైతులు వెనుదిరిగి పోవాల్సిన పరిస్థితి నెలకొంది.

సిర్పూరు(టి), సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): సిర్పూరు(టి) సహాకార బ్యాంకు వద్ద శనివారం వ్యవసాయాశాఖ అధికారి గిరిష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో రైతులందరికి యూరియాను శనివారం పంపిణీ చేశారు. దీంతో రైతులు రావటంతో రద్దీ ఏర్పడిండి. మధ్యాహ్నం కావటంతో వారికి సహాయం ిమాజీ ఎమ్మెల్యే కోనప్ప ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కోనప్ప వర్గీయులు సయ్యద్‌ కీజర్‌ హుస్సేన్‌, మాజీ ఎంపీటీసీ దుర్గం విక్రం, ఉప సర్పంచి తంగెడిపల్లి సంతోష్‌, వార్డు సభ్యుడు ఇఫత్‌ హుస్సెన్‌, ఉప సర్పంచి తోట మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 11:26 PM