Farmers: ఆర్‌ఆర్‌ఆర్ కొత్త అలైన్‌మెంట్‌తో నష్టం
ABN , Publish Date - Sep 22 , 2025 | 06:49 AM
రీజనల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) కొత్త అలైన్‌మెంట్ వల్ల చిన్న, సన్నకారు రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని చౌటుప్పల్, నారాయణపురం, గట్టుప్పల్, మర్రిగూడ...
కోదండరాం దృష్టికి తీసుకెళ్లిన రైతులు
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రీజనల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) కొత్త అలైన్‌మెంట్ వల్ల చిన్న, సన్నకారు రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని చౌటుప్పల్, నారాయణపురం, గట్టుప్పల్, మర్రిగూడ మండలాల భూ నిర్వాసిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై వారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ అన్యాయాన్ని అరికట్టాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. రైతుల విజ్ఞప్తికి స్పందించిన కోదండరాం. ఈ అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.