kumaram bheem asifabad- యూరియా అందక రైతుల అవస్థలు
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:25 PM
యూరియా అందక రైతులు అవస్థలు పడుతూ ఉంటే పట్టించుకోని రేవంత్‌రెడ్డి తానే ఇంకా పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎద్దేవా చేశారు.
చింతలమానేపల్లి, జూలై 19 (ఆంరఽధజ్యోతి): యూరియా అందక రైతులు అవస్థలు పడుతూ ఉంటే పట్టించుకోని రేవంత్‌రెడ్డి తానే ఇంకా పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. చింతలమానేపల్లి మండం డబ్బా గ్రామంలో యూరియా పంపిణీ కేంద్రంలో శనివారం రైతులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు రాజ్యం తామే తెచ్చామన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు యూరియా ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. ప్రజాపాలన రైతు రాజ్యం అంటే రైతులను రోజంతా క్యూలైన్లలో నిలబెట్టడమా అని ప్రశ్నించారు. వ్యవసాయ శాఖ మంత్రి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఐదుళ్లుగా ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు యూరియా పంపిణీ ఆపేయడం సరికాదన్నారు. విత్తనాలు ఇచ్చి వారి పంటను కొనుగలు చేసే ప్రభుత్వం వారికి యూరియా ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. ఎకరానికి రెండు యూరియా బస్తాలు ఇవ్వాల్సిన చోట ఒకటి ఇస్తున్నారని అవి కూడా సకాలంలో ఇవ్వడం లేదని చెప్పారు. ఇంకో ఐదు రోజులు యూరియా అందక పోతే పంట నాశనమయ్యే ప్రమాదం ఉందన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు కావాల్సినంత యూరియా సకాలంలో అందేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వ కాలంలో రైతులు ఏనాడు అసౌకర్యానికి గురి కాలేదని కాంగ్రెస్ పాలనలో రైతులు కన్నీరు పెడుతున్నారన్నారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా ప్రయోజనం లేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో మాట్లాడి ఒక్క యూరియా బస్తా తెప్పించే పరిస్థితి కూడా లేదన్నారు. అనంతరం దిందా వాగులో ప్రమాదవ శాత్తు జారిపడి మృతి చెందిన సుమన్ కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, కలెక్టర్ ప్రమాదాన్ని గుర్తించి సాయం చేయాలన్నారు. తునికాకు సేకరించి ఏడాది దాటినా ఇప్పటి వరకు బకాయిలు చెల్లించలేదని అందువల్ల ఈ ఏడాది ఎవరు కూడా తునికాకు సేకరణకు వెళ్లలేదన్నారు. అనంతరం కేతిని గ్రామంలోని ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థుల తో కాసేపు ఆటలు ఆడి వారిని ఉత్సాహపరిచారు. బాగా చదివి ఉద్యోగాలు చేయాలని, రోజు వార్తా పత్రికలు చదవాలని సూచించారు. ఆయన వెంట నాయకులు శ్యాంరావు, లహంచు, మనోహర్, శ్రీనివాస్, షాకీర్ తదితరులు ఉన్నారు.