kumaram bheem asifabad- యూరియా కోసం రైతుల రాస్తారోకో
ABN , Publish Date - Sep 22 , 2025 | 10:56 PM
మండల కేంద్రంలో ప్రధాన రోడ్డుపై యూరియా కోసం రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడినప్పటికీ సరిపడ యూరియా దొరకడం లేదని చెప్పారు. అదను దాటి పోతున్నా సకాలంలో యూరియా అందక సాగు చేసిన పంటలు నష్ట పోయే అవకాశం ఉందని ఆందోళన చేశారు.
బెజ్జూరు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ప్రధాన రోడ్డుపై యూరియా కోసం రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడినప్పటికీ సరిపడ యూరియా దొరకడం లేదని చెప్పారు. అదను దాటి పోతున్నా సకాలంలో యూరియా అందక సాగు చేసిన పంటలు నష్ట పోయే అవకాశం ఉందని ఆందోళన చేశారు. యూరియా సోమవారం ఇస్తారని చెప్పి పంపిణీ చేయక పోవడంతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు రోడ్డుపై బైఠాయిచారు. ఏవో రావాలి యూరియా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఏవో నాగరాజు, ఎస్సై సర్తాజ్ పాషా సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. యూరియా ఇచ్చేందుకు రైతులకు టోకెన్లు జారీ చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతులు చేపట్టిన ధర్నాకు వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.
రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): యూరియా రైతులకు సరిపడటం లేదని పంపిణీ చేయాలని సోమవారం రైతులు రెబ్బెనలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రెండు రోజులగా యూరియా కోసం వస్తున్నా అధికారులు ఇవ్వడం లేదని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటకృష్ణ అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అధికారులతో చర్చలు జరిపించి రైతులకు యూరియా అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.