Share News

యూరియా కోసం రైతుల రాస్తారోకో

ABN , Publish Date - Sep 09 , 2025 | 11:02 PM

మండలంలోని పడ్తన్‌పల్లి పీఏసీఎస్‌లో మంగళవారం ఉదయం యూరియా కోసం రైతులు రాస్తారోకో చేపట్టారు. పది రోజులుగా పీఎసీఎస్‌ ఆగ్రోస్‌లో యూరియా అడపా దడపా తీసుకొచ్చి లైన్‌లో పొద్దంతా నిలబడితే ఒకటే బస్తా ఇచ్చేవారు. కాని నాలుగు రోజులుగా మండలంలో యూరియా సరఫరా ఆగిపోయిం దని ఉదయం బస్తాల కోసం వచ్చి ఎదరు చూస్తే ఇప్పుడు లోడ్‌ రాలేదని చెప్పడంతో ఆవేదన చెందారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించు కోకపోవడంతో చేసేదేమిలేక రోడ్డుపై ఆందోళనకు దిగామన్నారు.

యూరియా కోసం రైతుల రాస్తారోకో

హాజీపూర్‌, సెప్టెంబరు9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పడ్తన్‌పల్లి పీఏసీఎస్‌లో మంగళవారం ఉదయం యూరియా కోసం రైతులు రాస్తారోకో చేపట్టారు. పది రోజులుగా పీఎసీఎస్‌ ఆగ్రోస్‌లో యూరియా అడపా దడపా తీసుకొచ్చి లైన్‌లో పొద్దంతా నిలబడితే ఒకటే బస్తా ఇచ్చేవారు. కాని నాలుగు రోజులుగా మండలంలో యూరియా సరఫరా ఆగిపోయిం దని ఉదయం బస్తాల కోసం వచ్చి ఎదరు చూస్తే ఇప్పుడు లోడ్‌ రాలేదని చెప్పడంతో ఆవేదన చెందారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించు కోకపోవడంతో చేసేదేమిలేక రోడ్డుపై ఆందోళనకు దిగామన్నారు. పలు గ్రామాలకు చెందిన రైతులు ధర్నాలో పాల్గొనగా సమాచారం అందుకు న్న ఎస్‌ఐ స్వరూపరాజు సంఘటన స్థలానికి వెళ్లి రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. రైతులు యూరియా కావాల్సిందేనని భీష్మించికూర్చు న్నారు. వ్యవసాయాధికారి క్రిష్ణకు సమాచారం అందించగా అక్కడికి చేరు కొని ఉన్నతాధికారులతో మాట్లాడి మంగళవారం రాత్రి వరకు 20 టన్ను ల యూరియా పీఎసీఎస్‌కు వస్తుందని తెలుపడంతో రైతులు ధర్నా విరమించారు.

దండేపల్లి: రైతులందరికీ సరిపడా యూరియా అందజేస్తామని మం డల వ్యపసాయాధికారి గొర్ల అంజిత్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం మండలంలోని ముత్యపేట రైతు వేదిక వద్ద క్టస్టర్‌ పరిధిలో రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేశారు. మన మండలానికి 170 టన్నుల యూరియా ఈనెల 15లోపు రానున్నదన్నారు. ద్వారక వేదికలో 10 ట న్నులు, ముత్యంపేట రైతు వేదికలో 10 టన్నుల, దండేపల్లి సొసైటీకి 20 టన్నులు, మిగితా 130 టన్నుల యూరియాను ఈనెల 12 నుంచి 15 వరకు ఆయా క్లస్టర్లులో రైతులకు అందజేస్తామన్నారు.

జైపూర్‌ : మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ కార్యాలయంతో పాటు కిష్టాపూర్‌లోని డీసీఎంఎస్‌ కేంద్రాల వద్ద మంగళవారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా కోసం ఉదయమే కేంద్రాల వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు. దీంతో శ్రీరాంపూర్‌ సీఐ వేణుచందర్‌, ఎస్‌ఐలు శ్రీధర్‌, సంతోష్‌, శ్వేతల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పోలీసు పహారా మధ్య రైతులకు ఒక్కొక్కరికి రెండు బస్తాల యూరియా అందజేశారు

Updated Date - Sep 09 , 2025 | 11:02 PM