Share News

ఆయిల్‌ పామ్‌ సాగుతో రైతులకు అధిక లాభాలు

ABN , Publish Date - Jul 26 , 2025 | 11:55 PM

ఆయిల్‌ ఫామ్‌ సాగుతో రైతు సం పాదన స్ధాయిని పెంచుతుందని జిల్లాఉద్యానవన శాఖ అధికారి అనిత అన్నారు. మామిడిపల్లి గ్రామాలోని సాగు చేస్తున్న ఆయిల్‌ ఫామ్‌, మా మిడి తోటలను శనివారం ఉధ్యానవన క్లస్టర అధికారి సహజతో కలిసి ఆయిల్‌ ఫామ్‌ తోటను సందర్శించి వారు పరిశీలించారు.

  ఆయిల్‌ పామ్‌ సాగుతో రైతులకు అధిక లాభాలు
తోటను పరిశీలిస్తున్న జిల్లా ఉద్యానవన అధికారి అనిత

జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అనిత

దండేపల్లి జూలై 26(ఆంఽధ్రజ్యోతి): ఆయిల్‌ ఫామ్‌ సాగుతో రైతు సం పాదన స్ధాయిని పెంచుతుందని జిల్లాఉద్యానవన శాఖ అధికారి అనిత అన్నారు. మామిడిపల్లి గ్రామాలోని సాగు చేస్తున్న ఆయిల్‌ ఫామ్‌, మా మిడి తోటలను శనివారం ఉధ్యానవన క్లస్టర అధికారి సహజతో కలిసి ఆయిల్‌ ఫామ్‌ తోటను సందర్శించి వారు పరిశీలించారు. ఆయిల్‌ ఫామ్‌ సాగులో మెలకువలు పాటించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించి రైతులు మంచి లాభాలు పొందాలన్నారు. పంట సాగులో యా జమాన్య పద్ధతులు, ఎరువుల వినియోగం గెల కోత సమయంలో జా గ్రత్తలు పాటించాలన్నారు. ఆయిల్‌ఫామ్‌ అంతర్‌ పంటలు సాగు చేసు కునే వెసుబాటు ఉంటుందన్నారు. ఆయిల్‌ ఫామ్‌ పంటల సాగుకు ప్ర భుత్వం అత్యధికంగా సబ్సిడి అందిస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 11:55 PM