kumaram bheem asifabad- యూరియా కోసం రైతుల ఆందోళన
ABN , Publish Date - Sep 09 , 2025 | 10:02 PM
యూరియా పంపిణీలో ప్రాథమిక సహకార సంఘం అధికారులు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారని నిరసిస్తూ మంగళవారం పీఏసీఎస్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. యూరియా కోసం రోజుల తరబడి పీఏసీఎస్ కార్యాలయాల చట్టూ తిరగాల్సి వస్తుందని రైతులు మండిపడుతున్నారు
వాంకిడి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): యూరియా పంపిణీలో ప్రాథమిక సహకార సంఘం అధికారులు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారని నిరసిస్తూ మంగళవారం పీఏసీఎస్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. యూరియా కోసం రోజుల తరబడి పీఏసీఎస్ కార్యాలయాల చట్టూ తిరగాల్సి వస్తుందని రైతులు మండిపడుతున్నారు. మూడు నెలల క్రితం యూరియా కోసం పట్టాదారు పాసుపుస్తకాల జిరాక్స్ పత్రాలు ఇస్తే ఇప్పటి వరకు అందించలేదని రైతులు వాపోతున్నారు. ముందు ఇచ్చిన పత్రాలను పక్కన పెట్టి కొత్తవారికి యూరియా ఇస్తున్నారని చెబుతున్నారు. రోజుల తరబడి యూరియా కోసం కార్యాలయం చుట్టు తిరుగుతూ ఉండాలా అంటు వాగ్వా దానికి దిగారు. సీరియల్ ప్రకారం యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేశా రు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేశారు. లోడ్ ఎరువులు రావడంతో ఎకరానికి ఒక బస్తా చొప్పున అందచేసినట్లు చెబుతున్నారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): యూరియా సరఫరా చేయాలని మంగళవారం కాగజ్‌నగర్ వ్యవసాయా మార్కెట్ కార్యాలయ సమీపంలోని రోడ్డుపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు పలువురు మాట్లాడుతూ తమకు కూపన్లు ఇచ్చి ఇంత వరకు యూరియా సరఫరా చేయడం లేదన్నారు.అధికారులు యూరియాను త్వరలోనే అందరికి అందజేస్తామని పేర్కొనటంతో ధర్నాను విరమించారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): ఎరువుల కోసం రైతులకు పాట్లు తప్పడం లేదు. యూరియా కోసం గత 20 రోజులుగా యూరియా వచ్చిన విషయాన్ని తెలుసుకొని మంగళవారం రైతులు దహెగాం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్దకు చేరుకొని క్యూలో చెప్పులు పెట్టారు. ఒక్క రైతుకు 2 నానో, 2 యూరియా బస్తాలు పంపిణీ చేసినట్లు పీఎసీఎస్ సీఈవో బక్కయ్య, తెలిపారు. రైతులకు 444 యూరియూ బస్తాలు 444 నానో స్ర్పే బాటిళ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ సిబ్బంది నారాయణ, జీవన్ తదితరులు పాల్గొన్నారు.
రోజుల తరబడి ఎదురుచూపులు..
కోరెంగ పర్వత్‌రావు, రైతు
యూరియా కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. జూలైలో పట్టాదారులు పుస్తకం జిరాక్స్ ధ్రువపత్రాలు పీఏసీఎస్ కార్యాలయంలో అందించాను. రెండు నెలల నుంచి యూరియ కోసం కార్యాలయం చట్టు తిరుగున్నా నా పత్రాలు తీయలేదు. కార్యాలయం సిబ్బంది ఫోన్ చేసి ఓటీపీ అడిగితే చెప్పాను. సార్ నాకు యూరియా ఇవ్వాలని అడిగాను. నువ్వు యూరియూ తీసుకుపోయావు నీకు రాదు అంటు నాకు పత్రాలు తిరిగి ఇచ్చేశారు. రెండు నెలల నుంచి యూరియ కోసం తిరిగినా ఫలితం లేకుండా పోయింది. నా పత్రాలపై వెరోకరికి యూరియా ఇచ్చారు. ఉన్నతాధికారులు సందించి యూరియా అందించేలా చర్యలు తీసుకోవాలి.