యూరియా కోసం రైతుల ఆందోళన
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:16 PM
మండల రైతులు శుక్రవారం నీల్వాయి సహకార సంఘం కార్యాలయం ముందు యూరియా బస్తాల కోసం నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాల నుంచి లారీల్లో 450 యూరి యా బస్తాలు సహకార సంఘం గోదాంకు వచ్చాయి. దీంతో రైతులు భారీ సంఖ్యలో చేరుకుని క్యూలైన్‌లో నిల్చున్నారు.
వేమనపల్లి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి) : మండల రైతులు శుక్రవారం నీల్వాయి సహకార సంఘం కార్యాలయం ముందు యూరియా బస్తాల కోసం నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాల నుంచి లారీల్లో 450 యూరి యా బస్తాలు సహకార సంఘం గోదాంకు వచ్చాయి. దీంతో రైతులు భారీ సంఖ్యలో చేరుకుని క్యూలైన్‌లో నిల్చున్నారు. వ్యవసాయాధికారి వీ రన్న, సహకార సంఘం సభ్యుల సమక్షంలో యూరియా బస్తాలను పం పిణీ చేస్తుండగా 10 ఎకరాలు ఉన్న రైతుకు సైతం ఒక్క యూరియా బస్తా ఇవ్వడంతో రైతులు నిరసన వ్యక్తం చేశారు. 250 మందికి యూరి యా బస్తాలు అందించగా మిగిలిన 200 బస్తాలు కూడా రైతులకు పంపిణీ చేయాలని ఆందోళన చేపట్టారు. దీంతో వ్యవసాయాధికారి వీర న్న మాట్లాడుతూ మిగిలిన యూరియా బస్తాలు వేరే గ్రామంలోని రైతు లకు పంపిణీ చేయాల్సి ఉందని చెప్పారు. దీంతో రైతులు తమకే పం పిణీ చేయాలని పట్టుబట్టడంతో బస్తాలను పంపిణీ చేశారు.