సేంద్రియ వ్యవసాయంతో రైతులకు మేలు
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:02 PM
సేంద్రియ వ్యవసా యం సాగుతో రైతులకు ఎంతో మే లు జరుగుతుందని జిల్లా వ్యవసా య అధికారి చంద్రశేఖర్ అన్నారు.

- జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్
అచ్చంపేటటౌన్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : సేంద్రియ వ్యవసా యం సాగుతో రైతులకు ఎంతో మే లు జరుగుతుందని జిల్లా వ్యవసా య అధికారి చంద్రశేఖర్ అన్నారు. మండల పరిధిలోని సింగారం గ్రా మంలో బొడ్డుపల్లి కృష్ణయ్య సేంద్రియ వ్యవ సాయ క్షేత్రంలో మంగళవారం నిర్వహిం చిన గో ఆధారిత వ్యవసాయంపై శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతి థిగా ఆయన పాల్గొని మాట్లాడారు. రసాయన ఎరువులు, పరుగుల మందులకు బదులుగా గో ఆధారిత వ్యవసాయం ఎంతో మేలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.