విద్యుదాఘాతంతో రైతు మృతి
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:39 AM
బోరు మోటార్‌కు విద్యుత్ సరఫరా కాకపోవడంతో స్తంభం ఎక్కి వైర్లను సరిచేస్తున్న రైతు విద్యుదా ఘతంతో మృతిచెందాడు.
స్తంభం ఎక్కి వైరు సరిచేస్తుండగా ఘటన
నల్లగొండ జిల్లా బచ్చాపురం గ్రామంలో విషాదం
నేరేడుగొమ్ము, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): బోరు మోటార్‌కు విద్యుత్ సరఫరా కాకపోవడంతో స్తంభం ఎక్కి వైర్లను సరిచేస్తున్న రైతు విద్యుదా ఘతంతో మృతిచెందాడు. ఆదివారం నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం బచ్చాపురం గ్రామం లో ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ కోటేష్ తెలిపిన వివరాల ప్రకారం... బచ్చాపురం గ్రామానికి చెందిన కేతావత్ లస్కర్(32) తనకున్న మూడు ఎకరాల్లో పత్తి, కూరగాయల సాగు చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం భార్య సులోచనతో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. పొలానికి నీరు పెట్టేందుకు బావి వద్ద ఉన్న మోటార్‌ను ఆన్ చేసి నీరు రాకపోవడంతో సమస్య తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను విద్యుత్ సరఫరా నిలిపివేసి వైరు సరిచేయడానికి విద్యుత్ స్తంభం ఎక్కాడు. స్తం భంపై వైరును సరిచేసే సమయంలో విద్యుదాఘాతానికి గురై కిందపడి అక్కడికక్కడే మృతి చెందా డు. భార్య సులోచన కేకలు వేయడంతో సమీపంలోని రైతులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరు కుని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లస్కర్ భార్య సులోచన ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కోటేష్ తెలిపారు.