Family Dispute: డబ్బుల కోసం వేధిస్తున్నాడని..యువకుడిని చంపింది కుటుంబ సభ్యులే
ABN , Publish Date - Sep 11 , 2025 | 04:26 AM
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో అనుమానాస్పద స్థితిలో మరణించిన యువకుడి కేసును పోలీసులు ఛేదించారు....
తండ్రి, పెద్ద కుమారుడు, సమీప బంధువు కలిసి హత్య
వెంకటాపూర్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో అనుమానాస్పద స్థితిలో మరణించిన యువకుడి కేసును పోలీసులు ఛేదించారు. గ్రామానికి చెందిన రిటైర్డు ఉపాధ్యాయుడు దుర్గం సూరయ్య ములుగులో నివాసం ఉంటున్నాడు. చిన్న కుమారుడు అశోక్ మద్యానికి బానిసై ఆన్‌లైన్ బెట్టింగులు, జూదానికి అలవాటు పడ్డాడు. తన వాటాగా సంక్రమించిన భూమిని కూడా విక్రయించా డు. ఆపై తల్లిదండ్రులను బెదిరించి డబ్బులు తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో ఈనెల 7న మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అశోక్ డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని తండ్రిని బెదిరించాడు. దీంతో తండ్రి సూరయ్య, సోదరుడు సంపత్, చిన్నాన్న సాంబయ్య కలిసి అశోక్‌ను హత్య చేశారు. పోలీసులు విచారిస్తున్న క్రమంలోనే కాంగ్రెస్ నాయకుడొకరి ద్వారా నలుగురు నిందితు లు లొంగిపోయినట్లు ములుగు సీఐ సురేశ్ తెలిపారు.