Political Pressure: బీఆర్‌ఎస్ నాయకుల వేధింపుల వల్లే ఆత్మహత్య
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:04 AM
రంగారెడ్డి జిల్లా కాంసాన్‌పల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తన కుమారుడు శేఖర్ వార్డు పదవికి వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలంటూ బీఆర్‌ఎస్...
పోలీసులకు మృతుడు ఆవ శేఖర్ తండ్రి ఫిర్యాదు
షాద్‌నగర్‌రూరల్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా కాంసాన్‌పల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తన కుమారుడు శేఖర్ వార్డు పదవికి వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలంటూ బీఆర్‌ఎస్ నాయకులు వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ మృతుడి తండ్రి ఆవ వెంకటయ్య మహబూబ్‌నగర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 4వవార్డు నుంచి బీజేపీ మద్దతుతో శేఖర్ నామినేషన్ వేయగా అదే వార్డు నుంచి బీఆర్‌ఎస్ మద్దతుతో కంది యాదయ్యగౌడ్ నామినేషన్ వేశారన్నారు. యాదయ్య వార్డు పెద్దలు, తనను కలిసి శేఖర్‌ను నామినేషన్ విత్‌డ్రా చేసుకొమ్మనగా.. శేఖర్ ఒప్పుకోలేదన్నారు. తర్వాత యాదయ్యగౌడ్.. శేఖర్‌ను బెదిరించినట్టు వెంకటయ్య ఆరోపించారు. దీంతో మంగళవారం గ్రామానికి చెందిన ఒకరితో కలిసి శేఖర్ బైక్‌పై షాద్‌నగర్ వెళ్లాడని, అదే రాత్రి షాద్‌నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. యాదయ్య గౌడ్ తన అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడ్డారని, విత్‌డ్రా చేసుకుంటే రూ.లక్ష ఇస్తామన్నారని వెంకటయ్య తెలిపారు. ఆయన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మహబూబ్‌నగర్ ఎక్సైజ్ పోలీసులు తదుపరి విచారణ కోసం కేసును షాద్‌నగర్ పోలీ్‌సస్టేషన్‌కు బదిలీ చేశారు.