kumaram bheem asifabad- అన్ని వర్గాలకు సముచిత న్యాయం
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:15 PM
జిల్లాలోని అన్ని వర్గాలతో పాటు పార్టీ కార్యకర్తలకు సముచిత న్యాయం చేస్తామని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నా రు. జిల్లా సరిహద్దులో గల మండలంలోని జంగాం ఘాట్ వద్ద మండల నాయకులు, కార్యకర్తలు ఆత్రం సగుణక్కకు మంగళవారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుగుణక్క హనుమాన్ ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాము నాయక్ తాండా (ఆశపెల్లి) నాయకులు, గ్రామస్థులు డీసీసీ అధ్యక్షురాలికి శాలువ కప్పి సన్మానించారు
జైనూర్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని వర్గాలతో పాటు పార్టీ కార్యకర్తలకు సముచిత న్యాయం చేస్తామని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నా రు. జిల్లా సరిహద్దులో గల మండలంలోని జంగాం ఘాట్ వద్ద మండల నాయకులు, కార్యకర్తలు ఆత్రం సగుణక్కకు మంగళవారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుగుణక్క హనుమాన్ ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాము నాయక్ తాండా (ఆశపెల్లి) నాయకులు, గ్రామస్థులు డీసీసీ అధ్యక్షురాలికి శాలువ కప్పి సన్మానించారు. అనంతరం జంగాం, ఉషేగాం, పొచంలొద్ది, మీదుగా పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహిం చారు. బస్టాండ్ కూడలిలో నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కుమరంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సుగుణక్క మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలను కలుపుకుని వెళుతూ జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. ముఖ్యంగా డీసీసీ మాజీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావుకు కాంగ్రెస్ పార్టీలో ఆపారమైన అనుభవం ఉందని, విశ్వప్రసాద్‌రావ్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నియోజక వర్గ ఇన్‌చార్జి అజ్మీరా శ్యాంనాయక్ సహకారంతో పని చేస్తామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని అన్ని పంచాయతీలలో పార్లీ బలపరిచే అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అధిష్థానం డీసీసీ పదవిని కట్ట బెట్టిందని చెప్పారు. ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వారి సూచనల మేరకు పార్టీని జిల్లాలో బలోపేతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్, వైస్ చైర్మన్ బానోత్ జైవంత్‌రావ్, పార్టీ మండల అధ్యక్షులు షేక్ అబ్దుల్ ముకీద్, ఉపాధ్యక్షులు పెందుర్ ప్రకాష్, మాజీ ఉపాధ్యక్షులు చిర్లే లక్ష్మణ్, షేక్ రషీద్, మాజీ సర్పంచులు కనక ప్రతిభ, రాథోడ్ సవిత రాందాస్, డైరెక్టర్లు లింగు, పంద్ర షేకు, నాయకులు మేస్రాం అంబాజీ, బాబర్, హైదర్, అజ్జులాలా, కోట్నాక దౌలత్‌రావ్, హైమద్, వసీం, ఆడ అమృత్‌రావ్ పాల్గొన్నారు.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని డీీసీసీ అధ్యక్షురాలి ఆత్రం సుగణ అన్నారు. డీసీసీ అధ్యక్షురాలుగా నియామకమైన ఆత్రం సుగణ మొదటి సారిగా మంగళవారం పుల్లారా గ్రామానికి రావడంతో గ్రామస్థులు, ఆదివాసీలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కుడ్మేత యశ్వంత్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు ఆత్రం శంకర్, మాజీ సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వర్‌రావు, సుద్దాల శ్రీనివాస్, గేడం శ్రీనివాస్, దేవిదాస్, రాము ఆరిఫ్, సోయం మోతిరాం, గ్రామస్థులు పాల్గొన్నారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): డీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన ఆత్రం సుగుణక్కను మంగళవారం కెరమెరి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాయంలో సన్మానించారు. అంతకు ముందు ఆమె మండల కేంద్రంలోని సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీఎం చైర్మన్ మునీర అహ్మద్, నాయకులు కుసుమ్‌రావు, లక్ష్మణ్‌రావు, జగన్నాథ్‌రావు, తులసీరాం, ఉత్తంనాయక్ తదితరులు పాల్గొన్నార