దసరా పండగ సెలవును మార్చడంలో విఫలం
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:12 PM
దసరా పండగ సె లవును అక్టోబరు 3కు మార్చడంలో గుర్తింపు సంఘం ఏఐటీ యూసీ, ప్రాతినిథ్య సంఘం ఐఎన్‌టీయూసీలు విఫలమ య్యాయని హెచ్‌ఎంఎస్ నాయకులు పేర్కొన్నారు. మంగళ వారం ఇందారం 1ఏ గని, ఓసీపీలో కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
జైపూర్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : దసరా పండగ సె లవును అక్టోబరు 3కు మార్చడంలో గుర్తింపు సంఘం ఏఐటీ యూసీ, ప్రాతినిథ్య సంఘం ఐఎన్‌టీయూసీలు విఫలమ య్యాయని హెచ్‌ఎంఎస్ నాయకులు పేర్కొన్నారు. మంగళ వారం ఇందారం 1ఏ గని, ఓసీపీలో కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ అక్టోబరు 2న గాం ధీ జయంతి రోజునే దసరా పండగ రావడంతో కార్మికులు పం డగను జరుపుకోలేక పోతున్నారన్నారు. పండగ సెలవును మూడవ తేదీకి మార్చాలని కార్మికులు, వారి కుటుంబీకులు ఎంత ఆశతో ఎదురు చూసినా జరగలేదన్నారు. ఈ రెండు సంఘాలు ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యా యన్నారు. కార్మికుల మనోభావాలకు అనుగుణంగా దసరా పండగ సెలవును అక్టోబరు 3కు మార్చాలని కోరారు. ఈ కార్య క్రమంలో నాయకులు సారయ్య, సాయికుమార్, పాల్గొన్నారు.