Share News

అంగన్‌వాడీ చిన్నారులకు వసతులు కల్పించాలి

ABN , Publish Date - May 14 , 2025 | 11:15 PM

మండల కేంద్రంలోని అం గన్‌వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వాటిలో మౌలిక వస తులు సమకూర్చి చిన్నా రులకు ఇబ్బందులు కలుగకుండా చూసు కోవాలని అంగన్‌వాడీ వర్కర్లను జిల్లా న్యాయ సేవాసంస్థ కార్యదర్శి నసీం సుల్తానా బుధవారం ఆదేశిం చారు.

అంగన్‌వాడీ చిన్నారులకు వసతులు కల్పించాలి
తాడూరు అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా

- జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా

తాడూరు, మే 14 (ఆంధ్రజ్యో తి) : మండల కేంద్రంలోని అం గన్‌వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వాటిలో మౌలిక వస తులు సమకూర్చి చిన్నా రులకు ఇబ్బందులు కలుగకుండా చూసు కోవాలని అంగన్‌వాడీ వర్కర్లను జిల్లా న్యాయ సేవాసంస్థ కార్యదర్శి నసీం సుల్తానా బుధవారం ఆదేశిం చారు. ఆమె మాట్లాడుతూ మౌలిక వసతులు సరిగ్గా లేవని ఒక ప్రీలిటిగేషన్‌ ఫిటిషన్‌ వచ్చిందని తెలిపారు. అందులో భాగంగా బుధ వారం ఆమె మండలంలోని అంగన్‌వాడీ కేంద్రా లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చైల్డ్‌ డెవలప్‌ మెంట్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ సూపర్‌వైజర్‌ పంచా యతీ కార్యదర్శి అంగన్‌ వాడీ టీచర్లు అంగన్‌వాడీ ఆయాలను అక్కడ కల్పిస్తున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. . కాబట్టి కనీస సౌకర్యాలు కల్పించాలని వారికి సూచించారు. కార్యక్రమంలో సీడీపీవో దమ యంతి, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ గురుస్వామి, సూ పర్‌వైజర్‌ గ్రామ కార్యదర్శి అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ ఆయాలు పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2025 | 11:15 PM