Share News

చిన్నారుల ఆహ్లాదం కోసం వసతులు

ABN , Publish Date - Nov 08 , 2025 | 11:00 PM

కార్మిక కుటుంబాలకు చెం దిన చిన్నారుల ఆహ్లాదం కోసం వసతులు కల్పిస్తున్నట్లు శ్రీరాంపూర్‌ ఏరి యా జీఎం మునిగంటి శ్రీనివాస్‌ అన్నారు. ఎస్‌ఆర్‌పీ 3,3ఏ గని వనరుల పెంపుదల ప్రణాళిక కమ్యూనిటీ ఓపెన్‌ జిమ్‌లో భాగంగా కృష్ణకాలనీలోని శాంతి స్టేడియంలో పిల్లలకు అవసరమైన ఊయల, జారుడుబండ, సీ- సా ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.

చిన్నారుల ఆహ్లాదం కోసం వసతులు

శ్రీరాంపూర్‌ జీఎం మునిగంటి శ్రీనివాస్‌

శ్రీరాంపూర్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : కార్మిక కుటుంబాలకు చెం దిన చిన్నారుల ఆహ్లాదం కోసం వసతులు కల్పిస్తున్నట్లు శ్రీరాంపూర్‌ ఏరి యా జీఎం మునిగంటి శ్రీనివాస్‌ అన్నారు. ఎస్‌ఆర్‌పీ 3,3ఏ గని వనరుల పెంపుదల ప్రణాళిక కమ్యూనిటీ ఓపెన్‌ జిమ్‌లో భాగంగా కృష్ణకాలనీలోని శాంతి స్టేడియంలో పిల్లలకు అవసరమైన ఊయల, జారుడుబండ, సీ- సా ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. శాంతి స్టేడియం పరిసర ప్రాం తాల ఉద్యోగుల సౌకర్యం కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చిన్నారులు ఆట వస్తువులను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో ఎస్‌ఓ టు జీఎం సత్యనారాయణ, ఏఐటీయూసీ బ్రాంచ్‌ కార్యదర్శి బా జీసైదా, డీజీఎం(పర్సనల్‌) అనిల్‌కుమార్‌, పర్యావరణ అధికారి హను మాన్‌ గౌడ్‌, ఐటీ ప్రోగ్రామర్‌ శ్రీనివాస్‌, పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2025 | 11:00 PM