kumaram bheem asifabad- వసతులు భళా..వినియోగం కరువు
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:07 PM
సింగరేణిలో పని చేసే వారి సంక్షేమంతో పాటు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని యజమాన్యం గోలేటి ప్రాంతంలో అనేక సదుపాయాలు కల్పించింది. మెరుగైన క్రీడా సౌకర్యాలు సమకూర్చింది. కానీ వాటిని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోలేక పోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయి.
రెబ్బెన, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో పని చేసే వారి సంక్షేమంతో పాటు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని యజమాన్యం గోలేటి ప్రాంతంలో అనేక సదుపాయాలు కల్పించింది. మెరుగైన క్రీడా సౌకర్యాలు సమకూర్చింది. కానీ వాటిని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోలేక పోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. బెల్లంపల్లి ఏరియాలో గోలేటి-1 ఇంక్లైన్, గోలేటి-1ఏ ఇంక్లైన్, గోలేటి-2 భూగర్భ గనితో పాటు కైరిగూడ ఓసీపీ, డోర్లి-1, డోర్లి-2, ఓపీఏ ఓసీపీ-2 ఒపెన్ ఖాస్టులు నడుస్తున్న క్రమంలో ఏడు వేల మందికి పైగా సింగరేణి ఉద్యోగులు పని చేస్తుండేవారు. ఆ సమయంలోనే ఇక్కడ వారికి అనేక క్రీడా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కాల క్రమంలో ప్రస్తుతం ఒక కైరిగూడ ఓసీపీ మాత్రమే కొనసాగుతోంది. దంతో ఉద్యోగుల సంఖ్య 925కు పడిపోయింది. కొత్తగా గోలేటి ఓపెన్ కాస్టు ప్రారంభమైతే తప్ప పూర్వ వైభవం వచ్చే అవకాశం లేదు.
- అందుబాటులో ఆట స్థలాలు..
క్రీడా స్థలాలకు అనుకున్న స్థాయిలో క్రీడాకారులు రాక బోసి పోతున్నాయి. గోలేటి భీమన్న మైదానంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్, క్రికెట్, లాన టెన్నీస్, ఫుట్‌బాల్, హకీ కోర్టు ఏర్పాటు చేశారు. గోలేటి సీఈఆర్, ఆఫీసర్ క్లబ్‌లలో ఉడెన్ షటిల్ కోర్టు, టేబుల్ టెన్నీస్, కార్యమ్, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికను నెలకొల్పారు. సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో బాల్‌బ్యాడ్మింటన్, కబడ్డీ కోర్టులు తీర్చిదిద్దారు. వ్యాయామం కోసం గోలేటి సీఈఆర క్లబ్ ఆవరణలో జిమ్, ఈతకొలను ఏర్పాటు చేశారు. ఆఫీసర్ క్లబ్‌లో ఇండోర షటిల్ కోర్టు, ధ్యానం కోసం రెండు పిరమిడ్ కేంద్రాలు, కోదండరామలయం ఎదుట ప్రత్యేకంగా ఉద్యానవనం ఏర్పాటు చేసి పిల్లల ఆట వస్తువులను సమకూర్చారు.
గ్రామం చిన్నదే అయినా...
గోలేటి గ్రామం చిన్నదైనా ఇక్కడి నుంచి ఎంతో మంది అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాఇ క్రీడా పతకాలు సాధించారు. కోలిండియా సాథయిలో పసిడి పతకాలు సాధించారు. గోలేటి సింగరేణి పాఠశాలలో చదివే విద్యార్థులు ఎక్కువగా క్రీడల్లో ప్రతిభ కనబరుస్తుంటారు. వివిధ క్రీడల్లో వంద మందికిపైగా క్రీడాకారులు జాతీయ స్థాయికి పరిచమయ్యారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో రాష్ట్రపతి, గవర్నర అవార్డులు సొంతం చేసుకన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి, సింగరేణి క్రీడల సమయంలో మాత్రం ఇక్కడి ఆట స్థలాలు కళకళలాడుతుంటాయి. యాజమాన్యం అందుబాటులో ఉంచిన మైదానాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు, యువత క్రీడల్లో రాణిస్తే గోలేటికి మరింత పేరు వచ్చే అవకాశం ఉంటుంది.