kumaram bheem asifabad- ఆలస్యమైతే ఆబ్సెంటే..
ABN , Publish Date - Aug 03 , 2025 | 10:53 PM
ప్రభుత్వ పాఠశా లల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు శుక్రవారం నుం చి ఫెషియల్ రికగ్నిషన్ సిస్టం(ఎఫ్‌ఆర్‌ఎస్) హాజరు ప్రారంభించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయ పాలన పాటించే విధంగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. హాజరును వారే నేరుగా ఆన్ లైన్‌లో నమోదు చేసుకునే విధంగా ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిం ది.
- సమయపాలన కోసం సర్కారు ప్రత్యేక యాప్
- పాఠశాల ఆవరణలోనే పని చేసే విధంగా రూపకల్పన
కౌటాల, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశా లల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు శుక్రవారం నుం చి ఫెషియల్ రికగ్నిషన్ సిస్టం(ఎఫ్‌ఆర్‌ఎస్) హాజరు ప్రారంభించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయ పాలన పాటించే విధంగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. హాజరును వారే నేరుగా ఆన్ లైన్‌లో నమోదు చేసుకునే విధంగా ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిం ది. సంబంధిత ఉపాధ్యాయుడి సెల్‌ఫోన్‌లోనే టీజీఎఫ్ ఆర్‌ఎస్ అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి వారి హాజరు నేరుగా ఆన్‌లైన్‌లోనే పంపించేందుకు ఏర్పాట్లు చేసిం ది. 2023 సెప్టెంబరు నుంచి పాఠశాలల్లోని విద్యార్థుల కు ఇప్పటికే ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను ఉపయోగించి విద్యార్థుల హాజరు శాతాన్ని నమోదు చేస్తుండగా గతేడాఇ ఆర్జేడీ, డీఈవో కార్యాలాయల్లో ఈ యాప్ ద్వారా హాజరు ప్రారంభమైంది. సంబంధిత పాఠశాల ప్రాంగణం నుంచి మాత్రమే ఉపాధ్యాయులు వారి ఫేస్ రికగ్నిషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
- నమోదు ఇలా..
రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలోని ఉపాధ్యాయుల సమయపాలన కోసం కొత్తగా ప్రవేశ పెట్టిన యాప్ టీజీఎఫ్‌ఆర్‌ఎస్ సంబంధిత ఉపాధ్యాయుడి స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తారు. మొదటగా యాప్‌లో సం బంధిత ఉపాధ్యాయుడి వివరాలతో రిజిస్టర్ చేసుకుని లాగిన్ కావాల్సి ఉంటుంది. యాప్ ఇన్‌స్టాలేషన్ సమయంలోనే సంబంధిత స్కూల్ ఆవరణ లాంగి గ్యూడ్, లాటిట్యూడ్‌లను టెక్నిషియన్ ఆప్‌లోడ్ చేస్తా రు. ఒక సారి లాగిన్ అయిన తరువాత యాప్ నిరం తరం వినియోగించవచ్చు. ఇక ఉపాధ్యాయుడు ఉద యం నిర్దేశిత సమయానికి కార్యాలయంలోకి వచ్చిన తరువాత యాప్‌ను ఓపెన్ చేసి క్లాక్ ఇన్ అనే ఆప్షన్‌పై నొక్కితే సదరు ఉపాధ్యాయుడు వచ్చిన సమయం ఆన్‌లైన్‌లో సంబంధిత పర్య వేక్షణాధికారికి చేరుతుంది. అలాగే ఆఫీస్‌లో పని సమయం ముగిసిన తరువాత క్లాక్ అవుట్ ఆనే ఆప్షన్‌పై టచ్ చేస్తే ఉపాధ్యాయుడి కార్యాలయాన్ని విడిచి వెళ్లే సమయా న్ని పని చేసిన గంటలను లెక్కించి తిరిగి సంబంధిత పర్యవేక్షణాధికారి ఆన్‌లైన్‌లో చేరుతుంది.
- పకడ్బందీగా యాప్..
టీజీఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌ను పకడ్బందీగానే తయారు చేసినట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయుడు ఎవరైనా నిర్దేశిత సమయానికి స్కూల్‌కు రాకుండా ఇంటి నుంచి గాని మరేదైనా ప్రదేశం నుంచి గానీ యాప్‌ను ఓపెన్ చేస్తే అది సంబంధిత స్కూల్ బయట ఉన్నారని సంక్షిప్త సందేశాన్ని ఇస్తుంది. ఉద్యోగులు తమ పాఠశాల ఆవరణలోకి వచ్చిన తరువాతనే క్లాక్ ఇన్ గానీ, క్లాక్ అవుట్ అనే అప్షన్లు యాప్‌లో పని చేస్తా యి. స్కూల్ ఆవరణకు సంబంఽధించిన లాంగిట్యూడ్, లాటిట్యూట్‌డ్‌లను యాప్‌లో పొందుపర్చడంతో సంబంధిత ఆవరణలో మాత్రమే ఆ యాప్ పని చేస్తుంది. కాగా విద్యాశాఖలోని అన్ని కార్యాలయాల్లో దశల వారీగా ఈ యాప్‌ను అమలు చేయ నున్నారు. ఇప్పటికే పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారానే ఆన్‌లైన్‌లో పంపిస్తున్నారు. ఇది 2023 సెప్టెంబరు నుంచి ప్రారంభమైంది. గతే డాది సెప్టెంబర్ నుంచి డీఈవో, ఆర్జేడీ, ఎంఈవో ఇతరాత్ర కార్యాలయాల్లో టీజీఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌ను అమలు చేస్తున్నారు. ఇప్పుడు పాఠశాలల్లో ఈ విధానా న్ని ఉపాధ్యాయులు, సిబ్బందికి అమలు చేస్తున్నారు.