kumaram bheem asifabad- అతివలే కీలకం
ABN , Publish Date - Dec 05 , 2025 | 10:38 PM
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించే శక్తిగా మహిళలు నిలవనున్నారు. మొత్తం ఓటర్లలో పురుషుల కన్నా 28,722 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో అభ్యర్థులు అతివల ఓట్లు రాబట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. హోరాహోరీగా సాగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో మహిళల ఓట్లు కీలకంగా మారాయి. దీంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఆమె ఆశీస్సులపై దృష్టి పెడుతున్నారు.
- అభ్యర్థుల ఎంపిక, వారి ఓట్లపై పార్టీల దృష్టి
- జిల్లాలో మొత్తం ఓటర్లు 3,53,895
- మహిళలు 1,77, 269, పురుషులు 1,76,606, ఇతరులు 20
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించే శక్తిగా మహిళలు నిలవనున్నారు. మొత్తం ఓటర్లలో పురుషుల కన్నా 28,722 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో అభ్యర్థులు అతివల ఓట్లు రాబట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. హోరాహోరీగా సాగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో మహిళల ఓట్లు కీలకంగా మారాయి. దీంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఆమె ఆశీస్సులపై దృష్టి పెడుతున్నారు.
జైనూర్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలను ప్రభావి తం చేసే సత్తా మహిళలకే ఉన్నట్లు ఓటర్ల లెక్కను బట్టి తెలుస్తోంది. జిల్లాలో పురుష ఓటర్లతో పోలిస్తే ఆమెదే పై చేయి కనిపిస్తోంది. మొత్తం 15 మండలాలకు గాను ఎనిమిది మండలాల్లో మహిళా ఓటర్లే ఎక్కువ. సర్పంచి స్థానాలకు పోటి చేసే పురుష అభ్యర్థులు, వారికి మద్దతుగా నిలుస్తున్న పార్టీలు మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. మొదటి విడతలో భాగంగా ఐదు మండలాల్లో నామినేషన్ల ప్రిక్రియ, ఉపసంహరణ పూర్తియింది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రెండో విడత విడుతలోనూ నామినేషన్లు పూర్తయ్యాయి. ఉపసంహరణ గడువు శనివారంతో ముగియనున్నది. మూడో విడత నామినేషన్లు శుక్రవారంతో పూర్తయ్యాయి. బరిలో నిలిచే అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు 3,53, 895 మంది ఓటర్లు సి ద్ధంగా ఉన్నారు. వీరిలో 1,76,606 మంది పురుషు లు, 1,77, 269 మంది మహిళలు, 20 మంది ఇతరులు ఉన్నారు.
- ఎక్కడెక్కడ ఎక్కువ అంటే..
జిల్లాలోని ఎనిమిది మండలాల్లో అధికంగా ఉన్నా రు. ఆసిఫాబాద్‌లో 237, బెజ్జుర్- 362, దహెగాం 63, జైనూర్ 491, లింగాపూర్ 376, సిర్పూర్(టి) 147, సిర్పూర్(యు) 605, తిర్యాణి 418, చొప్పున పురుషు లతో పోలిస్తే అధికంగా ఉన్నారు. అక్కడ ఫలితాలపై ప్రభావం చూపేది వారే. జిల్లాలో 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి భారీ సంఖ్యలో ఓటర్లు పెరిగారు. అప్పుడు మొత్తం ఓటర్లు 2,84,606 కాగా ..ప్రస్తుతం 3,53, 895కు చేరింది. అం టే 69,289 మంది ఓటర్లు పెరిగినట్లు స్పష్ఠమవ తోంది.
- పోటీలోనూ వారే..
ఓటర్ల పరంగానే కాకుండా రిజర్వేషన్ల నేపథ్యంలో పాలనా పగ్గాలు చేపట్టేందకు వారికే ఆవకాశాలు ఉన్నాయి. మొత్తం 335 సర్పంచ్ స్థానాల్లో 150 మహిళలకు కల్పించారు. ఇవే కాకుండా 185 స్థానాలు జనరల్‌కు కేటాయించారు. వీటిలోను వారు పోటి పడే ఆవకాశం ఉంటుంది. మొత్తం 2,874 వార్డు స్థానాల్లో 1276 మహిళలకు కేటాయించారు. 1,598 జనరల్ కావడంతో వాటిలోను పోటీ చేయవచ్చు. మహిళా ఓటర్లనను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా మహిళా సంఘాలను ఆకట్టుకునేలా ప్యూహ రచన చేస్తున్నారు. అధికార పార్టీ ఉచిత బస్సు, రుణ మాఫీ, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్ల వంటి వాటిని వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా ముందుకు సాగుతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మహిళల కోసం అమలు చేసిన పథకాలు కాంగ్రెస్ ఇచ్చిన హామీల విఫలం వంటి వాటిని వివరిస్తోంది. బీజేపీ నేతలు కేంద్రంలో మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, దేశ సుస్థిరత అంశాలను ఓటర్లకు వివరిస్తూ జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకునేలా యత్నిస్తోంది.