Share News

Urea Black Marketing: బయ్యారంలో బస్తాపై రూ.200 అదనంగా వసూలు

ABN , Publish Date - Sep 06 , 2025 | 03:25 AM

మహబూబాబాద్‌ జిలా బయ్యారం మండలంలోని రెండు ఫర్టిలైజర్‌ దుకాణాలకు 400 బస్తాల యూరియా దిగుమతి అయింది...

Urea Black Marketing: బయ్యారంలో బస్తాపై రూ.200 అదనంగా వసూలు

బయ్యారం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్‌ జిలా బయ్యారం మండలంలోని రెండు ఫర్టిలైజర్‌ దుకాణాలకు 400 బస్తాల యూరియా దిగుమతి అయింది. ఆ దుకాణాల వ్యాపారులు టోకెన్‌ పద్ధతిలో గురువారం సాయంత్రం వరకు ఒక్కో బస్తాను రూ.300కు విక్రయించారు. అయితే, రాత్రికి ఆ ధరను రూ.500కు పెంచినట్లు రైతులు ఆరోపించారు. ధర పెంచడంపై ప్రశ్నించగా పంపిణీ నిలిపివేసినట్లు తెలిసింది. తమ దుకాణాల వద్ద పురుగు మందులు కొనుగోలు చేసిన ఖాతాదారులకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి యూరియా సరఫరా చేశారని రైతులు మండిపడుతున్నారు.

Updated Date - Sep 06 , 2025 | 03:25 AM