kumaram bheem asifabad- ఏడు సహకార సంఘాల పదవీకాలం పొడిగింపు
ABN , Publish Date - Sep 05 , 2025 | 11:07 PM
జిల్లాలోని 12 సహకార సంఘాల లో ఏడు సంఘాల పాలకవర్గాల పదవీకాలాన్ని పొడగిస్తూ రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 14వ తేదీతో పీఏసీఎస్‌ల గడువు ముగియగా రైతులకు సేవలందిస్తూ మెరుగ్గా ఉన్న సంఘాల పదవీ కాలాన్ని మాత్రమే పొడిగించి మిగిలిన సంఘాలను పెండింగ్‌లో పెట్టింది.
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 12 సహకార సంఘాల లో ఏడు సంఘాల పాలకవర్గాల పదవీకాలాన్ని పొడగిస్తూ రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 14వ తేదీతో పీఏసీఎస్‌ల గడువు ముగియగా రైతులకు సేవలందిస్తూ మెరుగ్గా ఉన్న సంఘాల పదవీ కాలాన్ని మాత్రమే పొడిగించి మిగిలిన సంఘాలను పెండింగ్‌లో పెట్టింది. 2020లో ఎన్నికలు జరగడంతో పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 14న పదవీకాలం ముగిసింది. అప్పట్లో ఎన్నికలు నిర్వహించే వీలు లేకపోవడంతో ఆరు నెలలు పొడిగించారు. అదీ ఆగస్టు14న ముగిసిపోవడంతో మరో అరు నెలలు పెంచుతున్నట్లు ప్రకటించినా సంఘాల పనితీరును తెలియజేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఉత్కంఠ నెలకొంది. చివరికి పనితీరు మెరుగ్గా ఉన్న సొసైటీల పదవీకాలాన్ని పొడిగిం చి మిగిలిన సంఘాల పాలక వర్గాలను పెండింగ్‌లో పెట్టింది. అడిట్ అభ్యంతరాలు ఉన్నవి, అక్రమాలు చోటు చేసుకున్న సంఘాల పాలకవర్గాలను పెండింగ్‌లో ఉంచినట్లు తెలుసోంది. అయా సంఘాల పనితీరును క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి పొడిగించే వీలుందనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. సిర్పూర్(యూ)లోని బుర్నూర్, జైనూరు, కెరమెరి, కాగజ్‌నగర్, కౌటాల మండలంలోని గురుడుపేట, సిర్పూర్(టి), దహెగాం సంఘాలకు పొడిగించారు. ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బెన, తిర్యాణి, బెజ్జూరు సంఘాలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది.