Kodandareddy: ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలి
ABN , Publish Date - Sep 12 , 2025 | 04:20 AM
రాష్ట్రంలో ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచాలని, దీంతోపాటు సంప్రదాయ పంటలను కాపాడుకోవాల్సిన అవసరం...
సంప్రదాయ పంటలను రక్షించుకోవాలి: కోదండరెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచాలని, దీంతోపాటు సంప్రదాయ పంటలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని వ్యవసాయ, రైతు కమిషన్ చైౖర్మన్ ఎం. కోదండరెడ్డి అన్నారు. రైతు కమిషన్ కార్యాలయంలో మార్కెటింగ్, ఉద్యాన, యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించారు. ఒకప్పుడు నల్లగొండ జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో బత్తాయి సాగయ్యేదని, ఇప్పుడు అది 43 వేల ఎకరాలకు పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెటింగ్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో బత్తాయి రైతులు దళారుల చేతుల్లో మోసపోతున్నారని కోదండరెడ్డి అన్నారు. నల్లగొండలో ప్రైవేటు మార్కెట్ ఏర్పాటు చేస్తే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటంలేదని ప్రశ్నించారు. ఉద్యానశాఖ నర్సరీల ద్వారా రైతులకు నాణ్యమైన మొక్కలు సరఫరా చేయాలని సూచించారు.