Share News

V. Srinivas Goud: లిక్కర్‌ను ప్రోత్సహించే కుట్ర: శ్రీనివాస్‌‌గౌడ్‌

ABN , Publish Date - Aug 02 , 2025 | 04:36 AM

రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అరికట్టలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. కల్తీ కల్లు నివారణ పేరిట లిక్కర్‌ మాఫియాను ప్రోత్సహించేందుకు కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌‌గౌడ్‌ ఆరోపించారు.

V. Srinivas Goud: లిక్కర్‌ను ప్రోత్సహించే కుట్ర: శ్రీనివాస్‌‌గౌడ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అరికట్టలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. కల్తీ కల్లు నివారణ పేరిట లిక్కర్‌ మాఫియాను ప్రోత్సహించేందుకు కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌‌గౌడ్‌ ఆరోపించారు. ప్రజలపై భారంపడేలా మద్యం పాలసీని మార్చి.. మద్యం పైవచ్చే ఆదాయంతో ప్రభుత్వ ఖజానా నింపుకొంటామంటే.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అధికారం చేపట్టిన నాటినుంచి బీసీలకు 42ు రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్‌ మోసం చేస్తోందని, రిజర్వేషన్లు అమలుకాకపోతే.. ప్రభుత్వానికి శిరోముండనం తప్పదని బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజుశ్రవణ్‌, వకుళాభరణం కృష్ణమోహన్‌ హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

Updated Date - Aug 02 , 2025 | 04:36 AM