Share News

Exit Polls Predict Congress Win: జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌దే!

ABN , Publish Date - Nov 12 , 2025 | 03:05 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్‌ పార్టీకే ఓటర్లు పట్టం కట్టనున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు తేల్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌....

Exit Polls Predict Congress Win: జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌దే!

  • హస్తం పార్టీకి 6-8 శాతం ఓట్ల ఆధిక్యం

  • తేల్చి చెప్పిన ఎగ్జిట్‌ పోల్స్‌

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/పంజాగుట్ట, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్‌ పార్టీకే ఓటర్లు పట్టం కట్టనున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు తేల్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ 6 నుంచి 8 శాతం ఓట్ల ఆధిక్యంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై విజయం సాధించే అవకాశమున్నట్లు పేర్కొన్నాయి. మంగళవారం సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగియగానే పలు సర్వే సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ వివరాలను వెల్లడించాయి. దాదాపు అన్ని సంస్థలు కాంగ్రె్‌సకే జై కొట్టాయి. ప్రముఖ సర్వే సంస్థ ఆరా.. కాంగ్రెస్‌ పార్టీకి 47.49 శాతం ఓట్లు పోలైనట్లు తెలిపింది. బీఆర్‌ఎ్‌సకు 39.25 శాతం ఓట్లు పోలైనట్లు పేర్కొంది. బీజేపీకి 9.31 శాతం, ఇతరులకు 3.95 శాతం ఓట్లు పోలైనట్లు వెల్లడించింది. కాగా, ఆపరేషన్‌ చాణక్య సంస్థ.. కాంగ్రె్‌సకు 41.1 శాతం ఓట్లు, బీఆర్‌ఎ్‌సకు 37.7 శాతం, బీజేపీకి 13.3 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. పల్స్‌ టుడే అనే మరో సంస్థ ఎగ్జిట్‌ పోల్‌లో కాంగ్రె్‌సకు 47 శాతం, బీఆర్‌ఎ్‌సకు 44 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. కౌటిల్య సంస్థ స్పష్టంగా కాంగ్రెస్సే విజయం సాఽధిస్తుందని, బీఆర్‌ఎస్‌ కంటే 6 శాతం ఓట్లు అధికంగా సాఽధిస్తుందని తెలిపింది. ఇర పబ్లిక్స్‌ పల్స్‌ సర్వే సంస్థ కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు 48.5 శాతం ఓట్లు వస్తాయని, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతకు 41.8 శాతం వస్తాయని పేర్కొంది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి 6.5 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. చాణక్య స్ట్రాటజీస్‌ కూడా కాంగ్రె్‌సకు 46 శాతం, బీఆర్‌ఎ్‌సకు 43 శాతం ఓట్లు పోలైనట్లు, బీజేపీకి 6 శాతం మాత్రమే పోలైనట్లు పేర్కొంది. కాగా, కాంగ్రెస్‌ 48.31 శాతం, బీఆర్‌ఎస్‌ 43.18 శాతం, బీజేపీ 5.84 శాతం ఓట్లు వస్తాయని హెచ్‌ఎంఆర్‌ సర్వే తెలిపింది. అయితే మిషన్‌ చాణక్య సంస్థ ఒక్కటే బీఆర్‌ఎస్‌ ఒక శాతం ఓట్ల తేడాతో అధికార కాంగ్రెస్‌పై విజయం సాధిస్తుందని పేర్కొంది. బీఆర్‌ఎ్‌సకు 41.60 శాతం ఓటు వస్తాయని, కాంగ్రె్‌సకు 39.43 శాతం ఓట్లు, బీజేపీకి 18.97 శాతం మాత్రమే వస్తాయని తెలిపింది. వాస్తవానికి మొదట్లో కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేల్లో బీఆర్‌ఎ్‌సకు ఆధిక్యం ఉంటుందని తేలగా, మరికొన్ని సంస్థలు కాంగ్రె్‌సది పైచేయి అవుతుందని పేర్కొన్నాయి. అయితే పోలింగ్‌కు రెండు రోజుల ముందు పరిస్థితులు మారిపోయాయని సర్వే సంస్థలు అంచనాకు వచ్చాయి.

Updated Date - Nov 12 , 2025 | 03:05 AM