నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:12 PM
స్థానిక ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తాండూర్ సీఐ దేవయ్య అన్నారు. ఆదివారం సా యంత్రం మండల కేంద్రంతో పాటూ కేస్లాపూర్ గ్రామాల్లో పోలీస్‌ల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
భీమిని, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : స్థానిక ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తాండూర్ సీఐ దేవయ్య అన్నారు. ఆదివారం సా యంత్రం మండల కేంద్రంతో పాటూ కేస్లాపూర్ గ్రామాల్లో పోలీస్‌ల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు సహకరిం చాల న్నారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. శాంతి భద్రలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో భీమిని, కన్నె పల్లి, మాదారం ఎస్సైలు విజయ్ కుమార్, భాస్కర్ రావు, సౌజన్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు.