Share News

నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

ABN , Publish Date - Dec 05 , 2025 | 11:37 PM

పంచాయతీ ఎన్ని కల్లో ఓటర్లందరూ తమ ఓటుహక్కును నిర్భయంగా విని యోగించుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌ అన్నారు. శాంతియుత వాతావరణంలో పోలింగ్‌ నిర్వహిం చ డమే పోలీసుల లక్ష్యమని, అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

నెన్నెల, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : పంచాయతీ ఎన్ని కల్లో ఓటర్లందరూ తమ ఓటుహక్కును నిర్భయంగా విని యోగించుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌ అన్నారు. శాంతియుత వాతావరణంలో పోలింగ్‌ నిర్వహిం చ డమే పోలీసుల లక్ష్యమని, అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సమస్యాత్మక గ్రా మాలైన మైలారం, నెన్నెలలో శుక్రవారం సాయం త్రం నెన్నెల ఎస్సై ప్రసాద్‌ ఆధ్వర్యంలో సాయుధ దళాలతో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా కవాతు కొనసాగింది. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజలల్లో పోలీ సులపై నమ్మకం పెపొందించడం, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఫ్లాగ్‌మార్చ్‌లు నిర్వహిస్తున్నా మ న్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే లా తోడ్పాటునందించాలని ప్రజలను కోరారు. ఎన్నిక ల సమయంలో గొడవలకు దిగినవారిపై కేసులు న మోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తన నియ మావళిని తప్పకుండా పాటించాలన్నారు. ఎన్నికల్లో అక్రమా లు డబ్బుల పంపిణీ, బెదిరింపులు, ఓటర్లపై ఒత్తిడి లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమాల్లో బెల్లంపల్లి రూరల్‌ సీఐ హనోక్‌, తాళ్లగు రి జాల ఎస్సై రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2025 | 11:38 PM