Share News

kumaram bheem asifabad- రిజర్వేషన్లపై ‘ఉత్కంఠ’

ABN , Publish Date - Sep 24 , 2025 | 11:17 PM

స్థానిక సంస్థల రిజర్వేషన్లు కొలిక్కి వస్తుండడంతో ఆశావా హుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఆయా స్థానాల నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్న నాయకులు తమకు ఈ రిజర్వేషన్లు అనుకులిస్తాయా లేదోనని ఆందోళనలో ఉన్నారు. ఏ స్థానం ఎవరికి వస్తుందోనని చర్చ సాగుతోంది. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్‌, సంబంధిత అధికార యంత్రాంగం స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై విస్తృతంగా కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్లపై అధికార యంత్రాంగం గతంలో కేటాయించిన రిజర్వేషన్ల ప్రతులను పరిశీలించి రిజర్వేషన్లపై తుది నివేదికలను ప్రభుత్వానికి అందిం చనున్నది.

kumaram bheem asifabad- రిజర్వేషన్లపై ‘ఉత్కంఠ’
లోగో

- త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం

- కలిసొస్తాయో.. లేదోనని ఆశావహుల్లో ఆందోళన

- పోటీ చేసేందుకు సిద్ధం చేసుకుంటున్న నాయకులు

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల రిజర్వేషన్లు కొలిక్కి వస్తుండడంతో ఆశావా హుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఆయా స్థానాల నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్న నాయకులు తమకు ఈ రిజర్వేషన్లు అనుకులిస్తాయా లేదోనని ఆందోళనలో ఉన్నారు. ఏ స్థానం ఎవరికి వస్తుందోనని చర్చ సాగుతోంది. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్‌, సంబంధిత అధికార యంత్రాంగం స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై విస్తృతంగా కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్లపై అధికార యంత్రాంగం గతంలో కేటాయించిన రిజర్వేషన్ల ప్రతులను పరిశీలించి రిజర్వేషన్లపై తుది నివేదికలను ప్రభుత్వానికి అందిం చనున్నది. ఈ నేపథ్యంలో ఏ గ్రామపంచాయతీ ఎవరికి రిజర్వ్‌ అవుతుంది ఏ ఎంపీటీసీ స్థానం ఎవరికి దక్కుతుంది అనే దానిపై ఉత్కంఠ కొనసాగు తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రత్యేక జీవో తీసుకువచ్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే రెండు, మూడు రోజుల్లో రిజర్వేషన్లను ప్రకటించే అవకాశం ఉంది.

- 60కి పైగా ఏజెన్సీ పంచాయతీలు..

జిల్లాలో 60కి పైగా ఏజెన్సీ గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలలో సర్పంచ్‌ స్థానాలు ఎస్టీలకే రిజర్వుడ్‌ కానున్నాయి. ఏజెన్సీలో ఎంపీటీసీ, వార్డులకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నారు. కులగణన సర్వే ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ సారి బీసీ సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీల సంఖ్య పెరగనుంది. కాగా జనరల్‌ స్థానా ల్లోనూ బీసీలు పోటీ చేసే అవకాశం కల్పిస్తుంది.

- ఆశావహుల్లో టెన్షన్‌ టెన్షన్‌..

రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆశావహుల్లో టెన్షన్‌ మొదలైంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారుకు అవకాశం ఉన్నందున అంతాట ఉత్కంఠ కనిపిస్తోంది. ఈసారి అనుకూలమైన రిజర్వేషన్‌ వస్తుందో రాదోనన్న ఆం దోళన ఆశావాహుల్లో మొదలైంది. ఒకవేళ రిజర్వేషన్‌ అనుకూలంగా రాకుంటే ఇన్నాళ్లు పడిన శ్రమంతా వృధా అయ్యే అవకాశం ఉందంటూ నాయకులు వాపోతు న్నారు. రిజర్వేషన్‌ కలిసి వస్తే సర్పంచ్‌ లేదంటే ఎంపీటీసీ అనే ఉద్దేశ్యంతో పలువురు నేతలు కనిపిస్తున్నారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ఐదు నుంచి 10 మంది సర్పంచ్‌గా పోటీ చేసేందుకు సిద్ధవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రధాన పార్టీల మద్దతుతో పాటు మరికొంత మంది స్వతంత్రంగా ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. జనాభా ప్రతిపాదికన బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించే అవకాశం ఉన్నందున కొన్ని స్థానాలు తారుమారయ్యే అవకాశం లేకపోలేదు.

- జిల్లాలో 3,53,895 మంది ఓటర్లు..

జిల్లాలోని 15 మండలాల్లో మొత్తం 3,53,895 మం ది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 335 గ్రామపంచాయతీల పరిధిలో 2,874 వార్డులు ఉన్నాయి. 15 జడ్పీటీసీ స్థానాలు, 127 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లా లోని 15 మండలాల్లో మొత్తం 3,53,895 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,76,606 మంది పురుషులు, 1,77,269 మంది మహిళలు, 20 మంది ఇత రులు ఉన్నారు. జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను ప్రకటించింది. తాజగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రిజర్వేషన్ల ఖరారుపై అధికారులు కసరత్తును వేగవంతం చేశారు.

Updated Date - Sep 24 , 2025 | 11:17 PM