Share News

రిజర్వేషన్లపై ఉత్కంఠ...

ABN , Publish Date - Aug 10 , 2025 | 11:38 PM

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అటు ప్రభుత్వంతో పాటు ఇటు రాజకీయ పార్టీల్లోనూ కాక రేపుతోంది. హై కోర్టు సెప్టెంబరు 30 లోపు ఎన్నికలు నిర్వహిం చాలని హుకుం జారీ చేయడంతో ప్రస్తుతం నాయకు ల దృష్టంతా పంచాయతీ ఎన్నికలపైనే కేంద్రీకృతం అ యి ఉంది. రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల రిజర్వే షన్లు మారనుండడంతో ఆశావహుల్లో సమీకరణాలు రోజురోజుకూ మారుతున్నాయి.

రిజర్వేషన్లపై ఉత్కంఠ...

-స్థానిక ఎన్నికల్లో మారనున్న సమీకరణాలు

-జడ్పీ నుంచి సర్పంచ్‌ వరకు అదే తీరు

-బీసీ రిజర్వేషన్లపై స్పష్టత కరువు

-అయోమయంలో ఆశావహులు

మంచిర్యాల, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అటు ప్రభుత్వంతో పాటు ఇటు రాజకీయ పార్టీల్లోనూ కాక రేపుతోంది. హై కోర్టు సెప్టెంబరు 30 లోపు ఎన్నికలు నిర్వహిం చాలని హుకుం జారీ చేయడంతో ప్రస్తుతం నాయకు ల దృష్టంతా పంచాయతీ ఎన్నికలపైనే కేంద్రీకృతం అ యి ఉంది. రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల రిజర్వే షన్లు మారనుండడంతో ఆశావహుల్లో సమీకరణాలు రోజురోజుకూ మారుతున్నాయి. పంచాయతీ ఎన్నికల కన్నా ముందే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగ నున్నట్లు తెలుస్తుండడంతో ప్రాదేశిక ఎన్నికల్లో పోటి చేయాలనుకుంటున్న నేతలు రిజర్వేషన్ల విషయంలో తర్జనభర్జన పడుతున్నారు. తాము పోటీ చేయదల్చుకు న్న స్థానంలో రిజర్వేషన్‌ ఏది అమలవుతుందో స్పష్టత లేక సంధిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గ్రామ పం చాయతీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో గత ప్రభుత్వం రిజర్వేషన్లను రెండు పర్యాయాలకు వ ర్తించేలా 2018లో పంచాయతీ రాజ్‌ చట్టాన్ని తీసుకొ చ్చింది. అయితే డిసెంబర్‌లో నిర్వహించిన శాసనసభ సమావేశాల్లో పంచాయతీరాజ్‌ చట్టసవరణ బిల్లు - 2024 ఆమోదం పొందడంతో ఒకే దఫా మాత్రమే రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఫలితంగా ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు మారనున్నాయి. దీంతో ప్రాదేశిక ఎన్నికల్లో పోటి చేయాలని ఉత్సాహపడుతున్న నేతల్లో కొత్త రిజర్వేషన్లు ఎలా ఉంటాయోననే ఆసక్తి నెలకొం ది. రొటేషన్‌ పద్దతిలో రిజర్వేషన్లు మారనుండడంతో తమ ఆలోచన సరళిని మార్చుకుంటున్నారు. రిజర్వేష న్ల కేటాయింపుల్లో తొలుత ఎస్టీలకు రిజర్వు స్థానాలు కేటాయిస్తారు. ఎస్టీ తరువాత స్థానంలో ఎస్సీ అ నంత రం బీసీకి రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఈ లెక్కన జడ్పీ టీసీ ఎంపీటీసీతో పాటు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవు ల రిజర్వేషన్లలో మార్పులు ఉండనున్నాయి.

గతంలో రెండు నెలలు ముందుగానే...

ప్రాదేశిక ఎన్నికల పాలకవర్గాల గడువు గత ఏడాది జూలై 4వ తేదీతో ముగిసింది. నిజానికి పాలకవర్గాల గడువు ముగియగానే గరిష్టంగా మూడు నెలల్లోగా ఎ న్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాయి దావేస్తూ వస్తోంది. ఇదిలా ఉండగా గత ప్రభుత్వం అంతకు ముందు 2019లో అప్పటి పాలకవర్గాల గడువు ఐదేళ్లు ముగియకముందే, రెండు నెలల ముం దుగానే అంటే మే 15న ఎన్నికల ప్రక్రియను పూర్తి చే సింది. దీంతో అప్పుడు ఎన్నికైన కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టడానికి రెండు నెలలు వేచి ఉండాల్సి వచ్చింది. 2019లో కొలువుదీరిన పాలకవర్గాల ఐదేళ్ల గ డువు 2024 జూలైలో ముగిసిన వెంటనే ఎన్నికలు జ రుగకపోవడంతో అప్పటి నుంచి జిల్లా పరిషత్‌లు, ఎం పీటీసీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.

మొదలైన కసరత్తు...

జడ్‌పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో ఇప్పటికే కసరత్తు మొదలైంది. ఈ స్థానాల ఓటర్ల జాబితాలు, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, ముసా యిదా జాబితాల ప్రచురణ జనవరి 15వ తేదీతో ము గిసింది. ప్రస్తుతం ఓటరు జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్‌ అధికా రులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారుల నియామకం కూడా పూర్తయింది. సిబ్బందికి శిక్షణ తరగతులు కూ డా పూర్తయ్యాయి. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు బి జీగా ఉన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడైన నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉంది.

జిల్లాలో 306 పంచాయతీలకు ఎన్నికలు...

జిల్లాలోని 306 పంచాయతీలకు స్థానిక సంస్థల ఎ న్నికలు నిర్వహించాల్సి ఉంది. గతంలో 311 గ్రామ పం చాయతీలు ఉండగా హాజీపూర్‌ మండలంలోని వేంప ల్లి, కొత్తపల్లి, పోచంపాడు, ముల్కల్ల, నర్సింగాపూర్‌, చందనాపూర్‌, గుడిపేట, నంనూర్‌ గ్రామాలను మం చిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనం. అలాగే జై పూర్‌ మండలంలోని గోపాల్‌పూర్‌, కాసిపేట మండలం లోని వరిపేట, జన్నారం మండలంలోని చర్లపల్లి, మొ ర్రిగూడ, గ్రామాలను పంచాయతీలుగా మార్చాలనే డి మాండ్లు ఉన్నాయి. కొత్త పంచాయతీల ఏర్పాటుపై ప్ర భుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం తో ఇప్పటి వరకు ఉన్న 306 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరుగనున్నాయి. కాగా జిల్లా వ్యాప్తంగా ఎం పీటీసీ స్థానాలు 129 ఉండగా జడ్‌పీటీసీ స్థానాలు 16, ఎంపీపీ స్థానాలు 16 ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల కు సంబంధించి బ్యాలెట్‌ బాక్కులు, ఇతర సామగ్రి ఇ ప్పటికే జిల్లాకు చేరుకోగా ఎన్నికలు నిర్వహించడమే మిగిలి ఉంది.

బీసీ రిజర్వేషన్లపై స్పష్టత కరువు...

హై కోర్టు విధించిన గడువు సమీపిస్తుండటంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. ఎన్ని కల నిర్వహణకు ముందే వివిధ కులాలకు సంబంధిం చి రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నినాదం తారా స్థాయికి చేరడంతో రిజ ర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీసీ జనాభా ద మాషా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డి మాండ్‌ మేరకు రేవంత్‌ ప్రభుత్వం ఆ దిశగా అడుగు లు వేస్తోంది. ఈ విషయమై ప్రభుత్వం సానుకూల ని ర్ణయం తీసుకొని సంబంధిత ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆ మోదానికి పంపింది. కేంధ్రం నుంచి సహకారం లేక పోవడంతో పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. అదే జరిగితే రాబో యే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పార్టీలు 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సి వస్తుంది. లేనిప క్షంలో బీసీల ఛీత్కారాన్ని ఎదుర్కొనక తప్పని పరిస్థితు లు నెలకొంటాయి. అయితే బీసీ రిజర్వేషన్లపై స్పష్టత వస్తేగానీ, ఇతర కులస్థులకు ఎంత శాతం అమలవు తుందనేది తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభి ప్రాయపడుతున్నారు.

Updated Date - Aug 10 , 2025 | 11:38 PM