Share News

kumaram bheem asifabad- ‘సహకార’లో ఉత్కంఠ

ABN , Publish Date - Sep 02 , 2025 | 10:13 PM

జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌) పాలకవర్గాల గడువు గతనెల 14వ తేదీతో ముగిసింది. ఈ క్రమంలో పదవీ కాలం మరో ఆరు మాసాల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ నిబం ధనల ప్రకారం ఉన్న సొసైటీలకు మాత్రమే వర్తిస్తుందని మెలిక పెట్టింది. ఈ మేరకు పది అంశాలను నిర్ధేశిస్తూ పనితీరు పరిశీలించనున్నట్లు స్పష్టం చేసింది.

kumaram bheem asifabad- ‘సహకార’లో ఉత్కంఠ
ఆసిఫాబాద్‌లోని సహకార సంఘ కార్యాలయం

- పనితీరు సక్రమంగా ఉంటేనే అనుమతి

- నిబంధనలు విధించిన ప్రభుత్వం

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యో తి): జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌) పాలకవర్గాల గడువు గతనెల 14వ తేదీతో ముగిసింది. ఈ క్రమంలో పదవీ కాలం మరో ఆరు మాసాల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ నిబం ధనల ప్రకారం ఉన్న సొసైటీలకు మాత్రమే వర్తిస్తుందని మెలిక పెట్టింది. ఈ మేరకు పది అంశాలను నిర్ధేశిస్తూ పనితీరు పరిశీలించనున్నట్లు స్పష్టం చేసింది. పదవీకాలం పొడిగింపుపై హర్షం వ్యక్తం చేసిన చైర్మన్లు ప్రభుత్వం నిర్ధేశించిన నిబం ధనలతో డీలా పడిపోయారు. ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మార తం సొసైటీల వివరాలు సేకరించే పనిలో నిమగ్న మయ్యారు. జిల్లాలో 12 సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 25వేలకు పైగా సభ్యత్వం కలిగిన రైతులు ఉన్నారు.

- అన్నదాతకు అండగా...

మండల స్థాయిలో రైతులకు అవసరమైన ఎరు వులు, విత్తనాలు, పంట రుణాలు అందజేస్తూ సొసైటీలు వారికి అండగా నిలుస్తున్నాయి. ఇలాంటి వాటికి ప్రతి ఐదేళ్లకొకసారి ప్రభుత్వం ఎన్నికలు ని ర్వహిస్తుంది. సొసైటీ పరిధిలోని రైతులు, డైరెక్టర్లు, చైర్మన్లతో కూడిన పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. 2020లో ఎన్నికైన పాలకవర్గం గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 14తో ముగిసింది. అయితే రాష్ట్రంలోని డీ సీసీబీ చైర్మన్లు సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కలిసి విజ్ఞప్తి చేయడంతో పదవీకాలం ఆరు మాసాల పాటు పొడిగించింది. ఈ గడువు గతనెల 14తో ముగియ డంతో మరో ఆరు మాసాల పాటు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మొదటిసారి ఎలాంటి నిబంధనలు లేకుండా పదవీకాలం పొడిగించిన ప్రభుత్వం ఈసారి మాత్రం నిబంధనల ప్రకారం ఉన్న వాటికి మాత్రమే వర్తింపచేయాలనే నిబంఽ దన విధించడంతో సొసైటీల కొనసాగింపు సందే హంగా మారింది.

- తాజా నిబంధనల ప్రకారం..

తాజా నిబంధనల ప్రకారం పనితీరు మెరుగ్గా ఉంటేనే వాటి పాలకవర్గాల గడువు పొడిగింపు ఉం టుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం సొసైటీల వారీగా పది ఆంశాలతో కూడిన సమా చారం అందించాల్సిందిగా జిల్లా సహకారశాఖను ఆదేశించింది. సొసైటీ పరిధిలో పాత బకాయిల పరిస్థితి రుణాల తిరిగి చెల్లింపులు సక్రమంగా ఉన్నాయా, నిధుల దుర్వినియోగం ఏమైనా జరి గిందా జరిగితే వాటిపై ఎలాంటి విచారణ చేప ట్టారు దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టప రంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా సొసైటీ కార్య కలాపాలపై ఆడిట్‌ చేశారా చట్టపరమైన చర్య లు తీసుకున్నారా తదితర ఆంశాలను తీసుకున్నారు.

- చైర్మన్ల అయోమయం..

కాగా ప్రభుత్వ కొత్త నిబంధనలతో సొసైటీ చైర్మ న్లలో ఆయోమయం నెలకొంది. వ్యవసాయ సహ కార సంఘాల పాలకవర్గాల గడువు పాడిగిస్తున్న ట్లు ప్రభుత్వం గత 15 రోజుల క్రితం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగిస్తామని ఆగస్టు 13న వ్యవసాయశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. సంఘాల నిర్వహణ సక్రమంగా ఉన్న వాటినే కొన సాగించాలని లేనిచోట ప్రత్యేకాధికారులను నియమి స్తామని మెలిక పెట్టడంతో ఆయా సంఘాల చైర్మన్లు అయోమయానికి గురవుతున్నారు. పీఏసీ ఎస్‌ పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసి పోగా అరు మాసాలు గడువు పెంచారు. మరోసారి పెంపు కోసం పాలకవర్గాల పాత్రపై పది అంశా లతో కూడిన నివేదికను సిద్ధం చేయాలని సహకార బ్యాంకు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. చైర్మన్లు, పాలకవర్గాల సమావేశాలు, రైతులతో మమేకం, రుణాల మంజూరు, వసూలు, ఎరువుల సరఫరా, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలతో పా టు అవినీతి ఆరోప ణల వివరాలతో కమిషనరేట్‌ కార్యాలయం నివేదిక తెప్పించుకునే క్రమంలో జాప్యమవుతున్నాట్లు తెలుస్తోంది. చైర్మన్లు అందు బాటులో లేకపోవడం మొక్కుబడిగా కార్యకలా పా లు, రికవరీ లేకపోవడం, రుణ మంజూరులో అవక తవకలు ఉన్నచోట ప్రత్యేక అధికారులను నియ మించనుంది.

నివేదికలు పంపించాం..

- రాథోడ్‌ బిక్కునాయక్‌, జిల్లా సహకార అధికారి

ప్రభుత్వ ఆదేశాల మేరకు పది అంశాలతో కూ డిన నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం. త్వరలోనే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రానున్నాయి. తదుపరి ఆదేశాలకనుగుణంగా పొడి గింపుపై తగు చర్యలు తీసుకుంటాం.

Updated Date - Sep 02 , 2025 | 10:13 PM