Beer Production: మైక్రో బూవరీలకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - Sep 03 , 2025 | 05:14 AM
బీరు ప్రియులకు శుభవార్త. ఇన్నాళ్లూ రాష్ట్ర రాజధానికే పరిమితమైన మైక్రో బ్రూవరీలు త్వరలో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో...
బీరు ప్రియులకు శుభవార్త. ఇన్నాళ్లూ రాష్ట్ర రాజధానికే పరిమితమైన మైక్రో బ్రూవరీలు త్వరలో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఉన్న 16 కార్పొరేషన్‌ల పరిధిలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. తక్కువ పరిమాణంలో వివిధ రకాల రుచుల్లో బీరును ఉత్పత్తి చేసి అక్కడికక్కడే విక్రయించే యూనిట్లను మైక్రో బ్రూవరీలు అంటారు. పబ్‌లు, స్టార్ హోటళ్లు, కొన్ని బార్లలో ఈ మైక్రోబ్రూవరీలు ఉంటాయి. గ్రేటర్ జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం 18 మైక్రోబ్రూవరీలకు అనుమతులు ఉన్నాయి. అయితే, తొలిసారిగా జీహెచ్‌ఎంసీ బయట ఉన్న కార్పొరేషన్లలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ ప్రకటన జారీ చేసింది. మైక్రో బ్రూవరీలు ఏర్పాటుకు ఆస్తకి ఉన్నవారు సెప్టెంబరు 25 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ సూచించింది. అనుమతి పొందిన వారు 180 రోజుల వ్యవధిలో మైక్రొ బ్రూవరీని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.