గ్రామ పరిపాలన అధికారుల పరీక్షను పకడ్బందీగా నిర ్వహించాలి
ABN , Publish Date - May 22 , 2025 | 12:00 AM
జిల్లాలో ఈనెల 25న జరుగనున్న గ్రామ పరిపాల అధికారుల పరీక్షను పకడ్బందీగా నిర్వహించా లని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం నస్పూర్‌లో గల సమీకృత జిల్లా కారాయలయంలో కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, రాజస్వ మండల అధికారి శ్రీనివాస్‌రావులతో కలిసి జిల్లా వైద్య, విద్య ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్, సమాచారశాఖల అధికారుల పరీక్ష నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, మే21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈనెల 25న జరుగనున్న గ్రామ పరిపాల అధికారుల పరీక్షను పకడ్బందీగా నిర్వహించా లని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం నస్పూర్‌లో గల సమీకృత జిల్లా కారాయలయంలో కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, రాజస్వ మండల అధికారి శ్రీనివాస్‌రావులతో కలిసి జిల్లా వైద్య, విద్య ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్, సమాచారశాఖల అధికారుల పరీక్ష నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించే గ్రామ పరిపాలన అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఈ నెల 25న జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య, అగ్నిమా పక శాఖ అధికారి రమేశ్‌బాబు, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ రమ్యశ్రీ, కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశా ల ప్రధానోపాద్యాయులు వెంకటేశ్వర్ పాల్గొన్నారు.