Former minister Tanniru Harish Rao: టిమ్స్‌పై సర్కారుది నేరపూరిత నిర్లక్ష్యం
ABN , Publish Date - Nov 24 , 2025 | 04:17 AM
ప్రభుత్వ భూములను తెగనమ్మడంపై సీఎంకు ఉన్న శ్రద్ధ ప్రజలకు వైద్య సేవలందించే ఆసుపత్రులపై లేకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు...
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూములను తెగనమ్మడంపై సీఎంకు ఉన్న శ్రద్ధ ప్రజలకు వైద్య సేవలందించే ఆసుపత్రులపై లేకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. టిమ్స్ ఆసుపత్రులనిర్మాణాలు పూర్తిచేయకుండా, పేదలకు వైద్యం అందించకుండా దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం చూపుతోందన్నారు. వీటిని ఎప్పుడు ప్రారంభిస్తారో కోతల రేవంత్‌రెడ్డి చెప్పాలని ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన డిమాండ్ చేశారు. సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనులపై ప్రభుత్వం తీరు చూస్తే నత్త కూడా ఆత్మహత్య చేసుకుంటుందని ఎద్దేవా చేశారు. సీఎం సహా కాంగ్రెస్ మంత్రుల మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప దాటదని చెప్పడానికి టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణంలో జాప్యమే నిదర్శనమన్నారు.