Share News

Ex Minister Harish Rao criticized CM Revanth Reddy: విద్యాశాఖ నిర్వహణలో సీఎం రేవంత్‌ ఫెయిల్‌

ABN , Publish Date - Dec 04 , 2025 | 04:33 AM

విద్యాశాఖను కూడా తనవద్దే ఉంచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆ శాఖను సమర్థవంతంగా నిర్వహించడంలో పూర్తిగా ఫెయిల్‌ అయ్యారని మాజీమంత్రి....

Ex Minister Harish Rao criticized CM Revanth Reddy: విద్యాశాఖ నిర్వహణలో సీఎం రేవంత్‌ ఫెయిల్‌

  • విద్యార్థులకు మంచి భోజనం పెట్టండి:హరీశ్‌రావు

హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): విద్యాశాఖను కూడా తనవద్దే ఉంచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆ శాఖను సమర్థవంతంగా నిర్వహించడంలో పూర్తిగా ఫెయిల్‌ అయ్యారని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఓయూ లా కాలేజీ మెస్‌లో పాడైపోయిన అన్నం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయడం.. కాంగ్రెస్‌ పాలనలో విద్యావ్యవస్థ దుస్థితికి అద్దం పడుతోందన్నారు. మింగడానికి మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా రేవంత్‌రెడ్డి తీరు ఉందని, చేయాల్సిన పనులకు డబ్బుల్లేవంటూనే ఆర్భాటాలు మానడం లేదని బుధవారం ఎక్స్‌ వేదికగా ఎద్దేవా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్లు ఇస్తానని ప్రగల్భాలు పలికిన సీఎం, కనీసం విద్యార్థులకు ఒక పూట మంచి భోజనం పెట్టలేకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ఆయన తన ప్రగల్భాలు మాని.. విద్యార్థులకు కడుపు నిండా మంచి భోజనం పెట్టాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 04 , 2025 | 04:33 AM