Share News

Prabhakar Rao: ఐక్లౌడ్‌ పాస్‌వ‌ర్డ్ రీసెట్‌ చేయండి

ABN , Publish Date - Oct 15 , 2025 | 05:00 AM

రెన్సిక్‌ నిపుణుల సమక్షంలో తన ఐక్లౌడ్‌ పాస్‌వ‌ర్డ్‌ను రీసెట్‌ చేసి, దర్యాప్తు అధికారులకు అందించాలని.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు ప్రధాన నిందితుడు...

Prabhakar Rao: ఐక్లౌడ్‌ పాస్‌వ‌ర్డ్ రీసెట్‌ చేయండి

  • దర్యాప్తునకు అవసరమైన యాక్సెస్‌ అధికారులకు ఇవ్వండి

  • మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌ రావుకు సుప్రీం ఆదేశం

  • డేటా డిలీట్‌ చేసినట్టు తేలితే పిటిషన్‌ డిస్మిస్‌ చేస్తామని హెచ్చరిక

  • తదుపరి విచారణను నవంబరు 18కి వాయిదావేసిన ధర్మాసనం

న్యూఢిల్లీ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఫోరెన్సిక్‌ నిపుణుల సమక్షంలో తన ఐక్లౌడ్‌ పాస్‌వ‌ర్డ్‌ను రీసెట్‌ చేసి, దర్యాప్తు అధికారులకు అందించాలని.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు ప్రధాన నిందితుడు, మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌ రావును సుప్రీంకోర్టు ఆదేశించింది. డేటా డిలీట్‌ చేసినట్టు తేలితే ఆయన పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తామని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీ కేంద్రంగా ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు 2023 మార్చి 10న పంజగుట్ట పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రభాకర్‌ రావును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ క్రమంలోనే ప్రభాకర్‌ రావు అమెరికా వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్‌ ఇస్తేనే భారతదేశానికి తిరిగి వస్తానని ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. దీంతో ఆయన ఈ ఏడాది మే 9న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం మధ్యంతర రక్షణ కల్పించడంతో భారతదేశానికి వచ్చి సిట్‌ విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పిటిషన్‌.. జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట మంగళవారం విచారణకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించగా, ప్రభాకర్‌ రావు తరఫున సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు ప్రతివాదనలు చేశారు.


కస్టడీలోకి తీసుకుంటేనే..

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ప్రభాకర్‌ రావు కీలక నిందితుడని, ఆయన విచారణకు ఏ మాత్రం సహకరించట్లేదని తుషార్‌ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల ఫలితాలకు మూడు రోజుల ముందు, అంటే 2023 నవంబరు 29న.. 50 కొత్త హార్‌ ్డడిస్కులను కొనుగోలు చేశారని, ఆ తర్వాత రికార్‌ ్డ రూములోని సీసీ టీవీ కెమెరాలు స్విచ్‌ ఆఫ్‌ చేసి 36 పాత హార్‌ ్డ డిస్కుల్లోని కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదైన తర్వాత 2024 మార్చి 10న.. ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించినప్పుడు 2025 ఏప్రిల్‌ 5న.. రెండుసార్లు ఫోన్‌ను ఫార్మాట్‌ చేశారని, ఇది ముమ్మాటికీ ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నమేనని పేర్కొన్నారు. కీలకమైన ఐదో ఫోన్‌ గురించి ప్రశ్నిస్తే.. ఏడాదిలోపు వయసున్న తన మనవడు ఆడుకుంటూ కింద పడేయడంతో అది పూర్తిగా పగిలిపోయిందని చెబుతున్నారని, పాస్‌వర్‌ ్డ అడిగితే మరిచిపోయానని అంటున్నారని.. ఇదంతా నమ్మశక్యంగా లేదని తెలిపారు. ఎస్‌ఐబీ చీఫ్‌ పదవి నుంచి వైదొలిగిన వెంటనే తమ వద్ద ఉన్న పూర్తి సమాచారాన్ని, ఇతర వివరాలన్నింటినీ కొత్తగా బాధ్యతలు అప్పగించిన అధికారికి అప్పగించాలని.. కానీ ప్రభాకర్‌ రావు అలా చేయకుండా అన్నీ ధ్వంసం చేశారని తెలిపారు. ఇది రాజకీయ కక్ష సాధింపునకు సంబంధించిన కేసు కాదన్నారు. మావోయిస్టుల పేరుతో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, బిల్డర్లు, వ్యాపారులు, చివరికి.. న్యాయమూర్తుల ఫోన్లు సైతం ట్యాప్‌ చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ నేపథ్యంలో ఆయన విచారణకు సహకరించడం లేదని, కస్టడీలో విచారిస్తేనే నిజాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.

చీడేటా ధ్వంసం కిందకు రాదు..

హార్‌ ్డడిస్కులను మార్చడం అనేది నిఘా విభాగంలో సాధారణ ప్రక్రియ అని, అది డేటా ధ్వంసం కిందకు రాదని ప్రభాకర్‌రావు తరఫున సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు తెలిపారు. ఒకవేళ ప్రభాకర్‌ రావు ఆ డేటాను ధ్వంసం చేసినా ఇతర నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న రెండు టెరాబైట్ల డేటాలో ఆ సమాచారం ఉంటుందని ధర్మాసనానికి చెప్పారు. ప్రభాకర్‌రావు విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని, ఐక్లౌడ్‌ పాస్‌వర్‌ ్డను ఫొరెన్సిక్‌ నిపుణుల సమక్షంలో రీసెట్‌ చేసి ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే, దర్యాప్తు పారదర్శకంగా జరగడంలేదని, ఎమ్మెల్యేలు, ఎంపీలు జోక్యం చేసుకుంటున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అందుకే, ప్రక్రియ మొత్తాన్నీ వీడియో రికార్డింగ్‌ చేయాలని, ప్రభాకర్‌ రావు తరఫున కూడా ఒక ఫోరెన్సిక్‌ నిపుణుడికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభాకర్‌ రావు కోరిన అదనపు రక్షణలను తిరస్కరించిన ఆమె.. ‘పరిధిని విస్తరించవద్దు’ అంటూ హెచ్చరించారు. నోటీసు అందిన వెంటనే దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావాలని.. విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశించారు. ఫోరెన్సిక్‌ నిపుణుల సమక్షంలో ఐక్లౌడ్‌ ఖాతా పాస్‌వర్‌ ్డను రీసెట్‌ చేసి, దర్యాప్తునకు అవసరమైన యాక్సెస్‌ ఇవ్వాలని తేల్చిచెప్పారు. తదుపరి విచారణ వరకూ మధ్యంతర రక్షణ కొనసాగుతుందన్న ధర్మాసనం.. నవంబరు 18వ తేదీకి కేసును వాయిదా వేసింది.

Updated Date - Oct 15 , 2025 | 05:00 AM