kumaram bheem asifabad- గణనాథుల నిమజ్జనానికి సర్వం సిద్ధం
ABN , Publish Date - Sep 05 , 2025 | 11:03 PM
గణనాథుల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న వినాయకుడు శనివారం శోభా యాత్రకు గంగమ్మ చెంతకు చేరనున్నారు. గణేశ్ నిమజ్జనోత్సవానికి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. గణేశ్ మండపాల వద్ద ఏర్పాటు చేసిన గణనాథులు గత తొమ్మిది రోజుల పాటు ఘనంగా నవరాత్రోత్సవాలను పూర్తి చేసుకొని నిమజ్జనం శనివారం నిర్వహించేందుకు అంతా సిద్ధమవుతున్నారు.
- ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు
కాగజ్‌నగర్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): గణనాథుల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న వినాయకుడు శనివారం శోభా యాత్రకు గంగమ్మ చెంతకు చేరనున్నారు. గణేశ్ నిమజ్జనోత్సవానికి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. గణేశ్ మండపాల వద్ద ఏర్పాటు చేసిన గణనాథులు గత తొమ్మిది రోజుల పాటు ఘనంగా నవరాత్రోత్సవాలను పూర్తి చేసుకొని నిమజ్జనం శనివారం నిర్వహించేందుకు అంతా సిద్ధమవుతున్నారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలోని మున్సిపల్ అధికారులు, రెవెన్యూ, పోలీసులు సమన్వయంతో పని చేసి నిమజ్జమహోత్సవానికి ఏర్పాట్లు చేశారు. కాగజ్‌నగర్ మున్సిపాల్టీలోని విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు సమీప పెద్దవాగులో ఏర్పాట్లు చేశారు. నిమజ్జన కేంద్రం వద్ద లైట్లు, కంట్రోల్ రూం ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం చేసేందుకు అధికారులు క్రేన్‌ను తెప్పించారు. అందుబాటులో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. నిమజ్జనం చేసే స్థలాలను చిన్న పిల్లలను తీసుకరావద్ద అధికారులు మండలీల వారికి సూచించారు. సిర్పూరు డివిజన్‌లో సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించారు. జిల్లా ఎస్పీ క్రాంతిలాల్ ఆధ్వర్యంలో ఏఎస్పీ చిత్తరంజన్ రెండ్రోజులుగా పూర్తి స్థాయిలో పర్యవేక్షించారు. ఈ నిమజ్జన కార్యక్రమానికి 400 మంది పోలీసు సిబ్బందితో నిమజ్జన కార్యక్రమానికి నిర్వహించనున్నారు. విగ్రహాలను తరలించేందుకు విద్యుత్ వైర్లు ఆటంకం లేకుండా ఉండేందుకు సబ్ డివిజన్ ఇంజనీర్ నాగరాజు ఆధ్వర్యంలో టెక్నికల్ అధికారి జగన్ పర్యవేక్షణలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అలాగే రూట్ మ్యాప్ వద్ద విద్యుత్ వైర్లు సమస్య లేకుండా నూతనంగా పోల్స్‌ను ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్‌లోని గజముఖ గణనాధ మండలి వద్ద ఏర్పాటు చేసిన 19 అడుగుల విగ్రహం తరలించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు ప్రత్యేక రూట్ మ్యాప్ ఇచ్చారు. 19 అడుగుల విగ్రహాం వాహనంపైకి తరలిస్తే మరో మూడు అడుగు పెరిగే అవకాశం ఉండడంతో ముందస్తుగానే ప్రణాళిక ఇచ్చారు. ఈ మార్గం విద్యుత్ వైర్లను తొలగించారు. అలాగే చెట్ల కొమ్మలను కూడా కొట్టేశారు. నిమజ్జనం చేసే స్థలం వరకు పూర్తి క్లియరెన్స్ చేశారు.
నిబంధనలు పాటించాలి..
మండలీల నిర్వాహకులు నిబందనలు తప్పకుండా పాటించాలని పోలీసులు చెబుతున్నారు. పధానంగా మండపాల వద్ద్ద ఏర్పాటు చేసిన గణనాథ విగ్రహాల ఊరేగింపు సమయంలోట్రాక్టర్ డ్రైవర్ తప్పకుండా లైసెన్సు కలిగి ఉండాలి. అలాగే మద్యం ఎట్టిపరిస్థితుల్లో సేవించకుండా చూసుకోవాలి. గణనాథుడి విగ్రహాలను వీలైనంత త్వరగా ట్రాక్టర్‌లో పెట్టేట్టు చూసుకుంటే శోభాయాత్ర త్వరితగతిన పూర్తి చేసుకునే అవకాశాలుంటాయి. డీజేలకు అనుమతి ఇవ్వలేదు. చిన్నపాటి ఘర్షణలు తలెత్తితే వెంటనే కంట్రోల్ రూంకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు.
నిమజ్జన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
కాగజ్‌నగర్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ పెద్దవాగు నిమజ్జన స్థలాన్ని శుక్రవారం సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహాలు నిమజ్జానికి తీసుకుంటున్న ఏర్పాట్లపై అధికారులతో అడిగి తెలుసుకున్నారు. పకడ్భందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈయన వెంట స్థానిక నాయకులున్నారు.