kumaram bheem asifabad- స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:10 PM
కుమరం భీం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ముస్తాబైంది. వేడుకలను నిర్వహించేందుకు అదికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్ హాజరు కానున్నారు.
ఆసిఫాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ముస్తాబైంది. వేడుకలను నిర్వహించేందుకు అదికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్ హాజరు కానున్నారు. వేడుకల్లో భాగంగా ముఖ్య అతిధి బండ ప్రకాష్ గౌరవ వందనం స్వీకరించనుండడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ఏర్పాటు పనులను గురువారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్‌లు పరిశీలించారు. అలాగే వివిధ విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన అధికారులకు వేడుకల సందర్భంగా అవార్డులు ప్రదానం చేయనుండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం పూర్తి చేశారు. తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్ ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేస్తారు. 9:40 గంటలకు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రసంగిస్తారు. అనంతరం అత్యుత్తమ సేవలు అందించిన వారికి ప్రశంసాపత్రాలను అందజేసి విద్యార్థులచే నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించనున్నారు.