kumaram bheem asifabad- సర్వం సిద్ధం
ABN , Publish Date - Dec 10 , 2025 | 11:32 PM
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్‌కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలో మొదటి విడతగా గురువారం జరిగే పంచాయతీ పోరుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లాలో తొలి విడత 114 గ్రామ పంచాయతీ సర్పంచులు, 944 వార్డులు ఉండగా ఇందులో ఇప్పటికే 7 గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల స్థానాలు, 576 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
- పోలింగ్‌కు అధికార యంత్రాంగం సన్నద్ధం
- ఎన్నికల విధుల్లో 2,341 మంది సిబ్బంది
- ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్
- మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
ఆసిఫాబాద్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్‌కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలో మొదటి విడతగా గురువారం జరిగే పంచాయతీ పోరుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లాలో తొలి విడత 114 గ్రామ పంచాయతీ సర్పంచులు, 944 వార్డులు ఉండగా ఇందులో ఇప్పటికే 7 గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల స్థానాలు, 576 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీనిలో ఒక్క సర్పంచ్ స్థానానికి, 41 వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో 106 సర్పంచ్, 327 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో తొలి విడతగా పంచాయతీ ఎన్నికల్లో 99,844 మంది గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నికల్లో పారదర్శకత కోసం వీడియో కవరేజ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్‌లు ప్రత్యేక బందో బస్తును ఏర్పాటు చేస్తున్నారు. గురువారం ఉదయం నుంచి ఎన్నికలు జరగనుండడంతో పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించేందుకు తమ తమ ప్రయత్నాల్లో మునిగారు. జిల్లాలోని ఆసిఫాబాద్ డివిజన్‌లో గల ఐదు మండలాల్లో మొదటి విడతగా గురువారం ఎన్నికలు జరిగే 106 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, 327 వార్డులకు పోలింగ్ నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసిన అధికారులు సజావుగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన పర్యవేక్షణ యంత్రాంగాన్ని సంసిద్దం చేశారు. పోలింగ్ నిర్వహణ కోసం మొదటి విడత ఎన్నికల కోసం 2,341 మంది ఎన్నికల సిబ్బందిని వినియోగిస్తున్నారు. వీరిలో 1133 మంది పోలింగ్ అధికారులు, 1208 మంది సహయ పోలింగ్ అధికారులను నియమించారు. జిల్లాలో తొలి విడతగా పంచాయతీ ఎన్నికల్లో 99,844 మంది గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. తొలి విడత ఎన్నికలు జరిగే ఐదు మండలాలో ఆర్టీసీ బస్సులు, ప్రత్యేక వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నికల్లో పారదర్శకత కోసం వీడియో కవరేజ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు ప్రత్యేక బందో బస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఆ తరువాత అధికారులు ఫలితాలను వెల్లడించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటు వేసే సమయం తక్కువగా ఉండడంతో అభ్యర్థులు ప్రతి ఓటును కీలకంగా భావించి గ్రామాల్లో తమదైన శైలిలో ప్రచారం చేపడుతున్నారు.
106 పంచాయలు..
జిల్లాలో తొలి విడతగా ఎన్నికలు 114 గ్రామ పంచాయతీ సర్పంచులు, 944 వార్డులు ఉండగా ఇందులో ఇప్పటికే 7 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలు,576 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మరో 41 వార్డు స్థానాలకు,ఒక్క సర్పంచ్ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో 106 సర్పంచ్, 327 వార్డు స్థానాల్లో బరిలో ఉన్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్‌లో 2 సర్పంచ్,67 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి,అలాగే వాంకిడి మండలంలో ఒక్క సర్పంచ్ స్థానానికి నామినేషన్ ధాఖలు కాలేదు. 3 సర్పంచ్,112 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.కెరమెరి మండలంలో 2 సర్పంచ్,132 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.జైనూర్ మండలంలో 167,సిర్పూర్-యూలో 98 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.దీంతో 106గ్రామ పంచాయతీ పదవులకు 400 మంది అభ్యర్థులు, 327 వార్డులకు 743 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో నోటా..
అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలకే పరిమితమైన ‘నోటా’ను గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రవేశ పెట్టారు. దీంతో బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల గుర్తుల జాబితాలో చివరణ ‘నోటా’ను చేర్చారు. గ్రామ పంచాయతీలో తమకు నచ్చని అభ్యర్థులు ఉన్నట్లయితే ఓటర్లు నోటాపై ఓటు వేసేందుకు వెసులుబాటును కల్పించింది. బరిలో ఉన్న అభ్యర్థులు ‘నోటా’ గుర్తును బ్యాలెట్ పత్రాల్లో ఉంచడంతో ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే ఐదు మండలాల్లో ఎన్నికల సిబ్బంది, సామాగ్రిని పోలింగ్ బూతులకు తరలించేందుకు 20 ఆర్టీసీ బస్సులతో పాటు 60 కి పైగా ఇతర ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ వాహనాల ద్వారా ఎన్నికలు జరిగే జైనూర్,లింగాపూర్, సిర్పూర్(యు,) కెరమెరి,వాంకిడి మండలాల్లోని ఆయా పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని తరలించారు.
- 750 మంది పోలీసు సిబ్బంది:
తొలి విడత ఎన్నికల విధులకు750 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. గ్రామాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా ప్రత్యేక దృష్టి సారించారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక గ్రామాల్లో పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రత చేపట్టనుంది. సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పాటు ప్రత్యేక పోలీసులు బలగాలు బందో బస్తు చేపట్టనున్నారు.తొలి విడత ఎన్నికలు జరుగుతున్న మండలాలో బందోబస్తును ఏస్పీ నితిక పంత్ పర్యవేక్షీంచారు
తొలి విడతలో ఇలా..
పంచాయతీలు ఏకగ్రీవం పోటీ అభ్యర్థులు వార్డులు ఏకగ్రీవం నా.ద.స్థా పోటీ అభ్యర్థులు
జైనూర్ 26 0 26 104 222 167 05 50 109
కెరమెరి 31 02 29 113 250 132 14 104 222
లింగాపూర్ 14 02 12 44 112 67 04 41 85
సిర్పూర్-యూ 15 00 15 51 124 98 00 26 56
వాంకిడి 28 03 24 88 236 112 18 106 271
మొత్తం 114 07 106 400 944 576 41 327 743
ఆయా పంచాయతీల్లో ఓటర్లు ఇలా..
మండలం పురుషులు స్త్రీలు ఇతరులు మొత్తం
జైనూర్ 11,936 12,427 00 24,363
కెరమెరి 12,145 11,880 01 24,026
లింగాపూర్ 5,103 5,479 01 10,583
సిర్పూర్-యూ 5,835 6,440 02 12,277
వాంకిడి 14,458 14,134 03 28,595
మొత్తం 49,477 50,360 07 99,844