ప్రతీ ఒక్కరు పుస్తక పఠనం అలవర్చుకోవాలి
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:02 PM
పుస్తక పఠకం ప్రతి ఒక్కరు అలవర్చుని విజ్ఞాన వికాసాన్ని పొందాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్యాంసుందర్ అన్నారు.
- జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్యాంసుందర్
నాగర్‌కర్నూల్ టౌన్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : పుస్తక పఠకం ప్రతి ఒక్కరు అలవర్చుని విజ్ఞాన వికాసాన్ని పొందాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్యాంసుందర్ అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్ర లైబ్రరీ లో పుస్తకప్రదర్శన నిర్వహించారు. ప్రతీ రోజు పుస్తక పఠనానికి కొంత సమయం కేటా యించాలన్నారు. విద్యార్థులు, పోటీ పరీక్షలకు చదివే అభ్యర్థులు తమ లక్ష్యసాధన కోసం గ్రం థాలయాలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ జిలానీబేగం, సిబ్బం దితాజుద్దీన్,విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.